ప్ర‌భాస్ ఫీట్‌ని అనుకరించిన వ‌రుణ్‌.. బోల్తా ప‌డ్డ వితికా

Fri,October 18, 2019 11:45 AM

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్రమం మ‌రో రెండు వారాల‌లో ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ ఇంట్లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. గ‌త మూడు రోజులుగా హౌజ్‌మేట్స్ కుటుంబ స‌భ్యులు ఇంట్లో సంద‌డి చేయ‌గా, కామెడీ, ఎమోష‌న‌ల్‌, డ్రామా త‌దిత‌ర అంశాలు ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌ని అందించాయి. ఇక నేడు ఇంటి స‌భ్యుల‌కి బిగ్ బాస్ ఫన్ టాస్క్ ఇవ్వ‌గా, ఇందులో ఒక్కొక్కరు ఒక్కో సినిమా క్యారెక్ట‌ర్‌లో ఇన్వాల్స్ అయి జీవించారు. శ్రీముఖి.. మహాన‌టి చిత్రంలో కీర్తి సురేష్ పాత్ర పోషిస్తే, శివ‌జ్యోతి.. చంద్ర‌ముఖిలో జ్యోతిక‌గా అల‌రించింది. ఇక వ‌రుణ్ సందేశ్, వితికాలు బాహుబ‌లి 2 చిత్రంలోని ఓరోరి రాజ్యం సాంగ్ ఫీట్‌ని అనుక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సాంగ్‌లో ప్ర‌భాస్ వీపుపై నుండి అనుష్క బోట్‌లోకి ఎక్కుతుంది. ఇదే ప్ర‌య‌త్నం వితికా చేయ‌గా.. వ‌రుణ్ కెవ్వుమ‌ని కేక వేసాడు. తాజాగా విడుద‌లైన ప్రోమోలో ఆ స‌న్నివేశాలు చూపించారు. కాగా, ఇంటి స‌భ్యులు అంద‌రు ఈ వారం నామినేష‌న్‌లో ఉండ‌గా ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే దానిపై స‌స్పెన్స్ నెల‌కొంది.
5978
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles