సైమా వేడుక‌ల కోసం ఖ‌త‌ర్ చేరుకున్న చిరు

Thu,August 15, 2019 10:14 AM
chiru arrived at qatar

సౌత్ ఇండ‌స్ట్రీలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగే అవార్డుల కార్య‌క్ర‌మం సైమా (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్‌నేషనల్‌ మూవీ అవార్డ్స్‌). ప్ర‌తి ఏడాది ఎంతో ఘ‌నంగా జ‌రిగే ఈ అవార్డుల కార్య‌క్ర‌మం ఈ సారి ఖతర్‌లోని దోహలో జ‌ర‌గ‌నుంది. ఆగ‌స్ట్ 15, 16 తేదీల‌లో జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మాల‌నికి తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌కి చెందిన ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు హాజరు కానున్నారు. 15వ తేదీ తెలుగు, క‌న్న‌డ సినిమాల‌కి సంబంధించిన అవార్డులు కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుండ‌గా, ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రుకానున్నారు. ఇక 16వ తేదీన తమిళ, మలయాళ చిత్రాలకు సంబంధించిన అవార్డుల వేడుక జ‌ర‌ప‌నుండ‌గా ఆ రోజు మాలీవుడ్ మెగాస్టార్ మోహ‌న్ లాల్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌వుతారు. ఇద్ద‌రు మెగాస్టార్స్ సైమా వేడుక‌లో సంద‌డి చేయ‌నుండ‌డంతో ఈ కార్య‌క్ర‌మంపై అంద‌రిలో ఆస‌క్తి పెరిగింది. అయితే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవితో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, కేజీఎఫ్ స్టార్ య‌ష్ ఖ‌త‌ర్ చేరుకున్నారు. వారికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.


948
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles