హిందూ మ‌నోభావాలని దెబ్బ‌తీసిన వాణి.. కేసు న‌మోదు

Fri,November 22, 2019 12:14 PM

బాలీవుడ్ బ్యూటీ వాణీ క‌పూర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా సుప‌ర‌చిత‌మే. తెలుగులో ఆహా క‌ళ్యాణం సినిమాతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మ‌డు త‌న ఫోటోషూట్‌కి సంబంధించిన ఫోటోల‌ని రెగ్యుల‌ర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా హిందువుల ప్ర‌ధాన దేవుడు రాముడు పేరుతో ఉన్న బ్లౌజ్ ధ‌రించి ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో నెటిజ‌న్స్ ఆమెపై మండిప‌డ్డారు. రాముడు పేరుతో ఉన్న ఇలాంటి దుస్తులు ధ‌రించి హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీస్తున్నావు అని ఆమెపై మండి ప‌డ్డారు. ఓ వ్య‌క్తి ఏకంగా ముంబై పోలీసుల‌కి కూడా ఫిర్యాదు చేశాడు. స‌ద‌రు వ్య‌క్తి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. వివాదం ముదురుతున్న క్ర‌మంలో వాణి క‌పూర్ త‌న ఫోటోని ప‌ర్స‌న‌ల్ అకౌంట్ నుండి తొల‌గించింది. కాని అప్ప‌టికే ఆ ఫోటోలో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి.1814
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles