డిస్కోరాజా నుండి పాయ‌ల్ రాజ్‌పుత్ లుక్ వ‌చ్చేసింది

Thu,December 5, 2019 10:23 AM

ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌. కెరియ‌ర్‌లో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ అమ్మ‌డు ఇటు తెలుగు, అటు త‌మిళ సినిమాల‌ని సెల‌క్టివ్‌గా ఎంపిక చేసుకుంటుంది. ప్ర‌స్తుతం డిస్కోరాజా చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. నేడు పాయ‌ల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర బృందం ఆమె ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో రెండు జ‌డ‌లు వేసుకొని చేతిలో గ‌న్ ప‌ట్టుకొని సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తుంది. ఈ పోస్ట‌ర్ పాయ‌ల్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ర‌వితేజ‌, పాయల్ రాజ్‌పుత్, నభ నటేష్, తాన్యా హోప్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న డిస్కోరాజా చిత్రాన్ని జ‌న‌వ‌రి 24న విడుద‌ల చేయ‌నున్నారు. డిసెంబ‌ర్ 6న చిత్ర టీజ‌ర్ విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. కాగా, పాయ‌ల్.. వెంకీ మామ అనే చిత్రంలోను న‌టించ‌గా, ఈ మూవీ డిసెంబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

1807
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles