శ్రీదేవి జీవితంపై రానున్న పుస్త‌కం

Wed,August 14, 2019 11:57 AM
biography on sridevi

వెండితెర అస‌మాన న‌టి శ్రీదేవి దివికెగ‌సి ఏడాది దాటింది. ఆమె మ‌ర‌ణం ఇప్ప‌టికి ఓ క‌ల‌గానే ఉంది. బోనికపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ మార్వా పెళ్ళిక‌ని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్ర‌వ‌రి 24,2018న బాత్ ట‌బ్‌లో మునిగి క‌న్ను మూసింది . రాష్ట్రం, దేశం అని కాకుండా ప్ర‌పంచ‌మంతటా ఉన్న ఎంద‌రో అభిమానుల ఆద‌ర‌ణ పొందింది శ్రీదేవి. నాలుగో ఏటనే తమిళ సినిమాలో నటించింది శ్రీదేవి. ఆ తర్వాత తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా బాలనటిగా అనేక పాత్ర‌లు పోషించింది . జూలీ సినిమాతో హిందీలోకి అడుగిడిన శ్రీదేవి తన పదహారో ఏట పదహారేళ్ల వయసు సినిమాలో చేసింది. అప్పట్లో ఆ సినిమా మంచి హిట్. ఇప్పుడు కూడా శ్రీదేవి పేరు చెబితే... చాలామందికి ఆ సినిమా గుర్తొస్తుంది.

రెండు తరాల టాప్ హీరోలైన ఎన్టీఆర్,ఏఎన్ఆర్,కృష్ణ, శోభన్ బాబు తో పాటు చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున‌, క‌మ‌ల్‌, ర‌జ‌నీకాంత్ వంటి సూప‌ర్ స్టార్స్ స‌ర‌స‌న న‌టించిన ఘ‌న‌త శ్రీదేవికి ద‌క్కింది. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను శ్రీదేవి వ్య‌క్తితం చాలా మంచిదని అంటారు. 1963 ఆగస్టు 13న శ్రీదేవి తమిళనాడులో జన్మించిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం ఆమె జ‌యంతి సంద‌ర్భంగా ప్రముఖ పబ్లిషర్స్‌ పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా శ్రీదేవి జీవిత చరిత్రను పుస్తక రూపంలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇందుకు ఆమె భ‌ర్త బోనికపూర్‌ అనుమతి కూడా తీసుకున్నార‌ట‌.

‘శ్రీదేవి : గర్ల్‌ ఉమెన్‌ సూపర్‌ స్టార్‌’ పేరుతో రూపొందుతున్న ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సత్యార్థ నాయక్‌ రాస్తున్నారు. శ్రీదేవి లాంటి గొప్ప తార‌పై జీవితం రాసే అవ‌కాశం రావ‌డం చాలా ఆనందంగా ఉంది. ఆమెతో క‌లిసి న‌టించిన తార‌ల‌ని క‌లుసుకొని ఆమె జీవితానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుసుకున్నాను. ఓ చిన్నారి భార‌త తొలి లేడీ సూప‌ర్ స్టార్ గా ఎలా మారింద‌నేది పుస్త‌కం ద్వారా చెప్ప‌బోతున్నాను అని స‌త్యార్ధ నాయ‌క్ స్ప‌ష్టం చేశారు. అక్టోబ‌ర్‌లో బుక్ రిలీజ్ చేసేందుకు వారు స‌న్నాహాలు చేస్తున్నారు.

669
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles