నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రూలర్ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇప్పటికే చిత్రంలో బాలయ్య లుక్‌కి సంబంధించి పలు పోస్టర్స్ విడుదల చేశారు. ఇందులో కొన్ని పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా, పోలీస్ గెటప్‌లో ఉన్న పోస్టర్‌పై విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా చిత్రం నుండి మరో పోస్టర్ విడుదల చేశారు. చేతిలో గోల్ఫ్ బ్యాట్ , తలకి క్యాప్, కళ్ళకి అద్దాలతో యంగ్ హీరో లుక్‌లో కనిపిస్తున్నాడని అభిమానులు అంటున్నారు. ఈ పోస్టర్ ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళ్లింది. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని టీం భావిస్తుంది.