దీపికాకి చుర‌కలు అంటించిన రామ్‌దేవ్ బాబా

Tue,January 14, 2020 10:18 AM

బాలీవుడ్ బ్యూటీ దీపికాపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తూనే ఉంది. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కి వెళ్లి, అక్క‌డ దుండగుల దాడిలో గాయపడిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిశీ ఘోష్‌తోపాటు మరికొందరు బాధిత విద్యార్థులను దీపికాకి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ చ‌ర్య‌పై కొంద‌రు దీపికాకి మ‌ద్దుతు తెల‌ప‌గా, మ‌రికొంద‌రు ఆమెను నిందిస్తున్నారు. దేశ‌ద్రోహుల‌కి బాస‌ట‌గా ఎలా నిలుస్తావు అంటూ ఫైర్ అవుతున్నారు.


ఇటీవ‌ల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ .. దీపికా చ‌ర్య‌ని తప్పు ప‌ట్ట‌గా, తాజాగా ప్ర‌ముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా దీపికాకి చుర‌క‌లు అంటించారు. ఏదైన విష‌యం గురించి మాట్లాడే ముందు, దేశ సామాజిక‌, ఆర్ధిక ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాలి. తెలియ‌క‌పోతే ఎవ‌రైన స‌ల‌హాదారుడిని నియ‌మించుకొని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని దీపికాకి సూచించారు. రెండు కోట్ల‌కి పైగా వ‌ల‌స‌దారులు దేశంలో అక్ర‌మంగా నివ‌సిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు ద్వారా, అక్రమ వలసలను అరికట్టే అవకాశం ఉంటుందని రామ్‌దేవ్ అభిప్రాయ‌ప‌డ్డారు. కొంద‌రు సొంత ప్ర‌యోజ‌నాల కోసం ఆందోళ‌న‌లు చేస్తున్నారు. ఇది దేశానికి మంచి కాద‌ని స్ప‌ష్టం చేశారు

1878
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles