బిగ్ బాస్ హౌజ్‌లో అంబ‌రాన్నంటిన సంబ‌రాలు

Sun,November 3, 2019 07:48 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3కి నేడు ఎండ్ కార్డ్ ప‌డ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎక్స్ హౌజ్‌మేంట్స్ ఇంట్లోకి వ‌చ్చి సంద‌డి చేశారు. హౌజ్‌లో బిగ్ బాస్ సీజన్ 3 రీయూనియన్ రెట్రో పార్టీ జ‌ర‌గ‌గా, ఈ పార్టీకి జాఫర్ యాంకర్‌గా వ్యవహరించారు. అత‌నికి స‌హాయ‌కుడిగా బాబా భాస్క‌ర్ ఉన్నారు. అంద‌రు జిగేల్ జిగేల్ మ‌నేలా డ్రెస్సెస్ ధ‌రించగా, ఒక్కొక్క‌రికి ఒక్కో అవార్డ్‌ని అందించారు. అవార్డులు విష‌యానికి వ‌స్తే..

1. పక్కా మాస్ అవార్డ్ - నటి హేమ (ఈ అవార్డు రాహుల్ చేతుల మీదుగా అందుకుంది)


2. అగ్నిగోళం అవార్డు - పునర్నవి భూపాలం (ఈ అవార్డుని వితికా షెరు చేతుల మీదుగా అందుకుంది)

3. సర్వజ్ఞాని అవార్డు- జాఫర్ ( ఈ అవార్డుని హేమ చేతుల మీదుగా అందుకున్నారు )

4. మెరుపుతీగ అవార్డు- శిల్ప చక్రవర్తి (ఈ అవార్డుని శ్రీముఖి చేతుల మీదుగా అందుకుంది)

5. మిస్టర్ రోమియో అవార్డు - అలీ రెజా (ఈ అవార్డుని రవి క్రిష్ణ చేతుల మీదుగా అందుకున్నారు.)

6. బెస్ట్ కామెడీ ఛానల్ అవార్డు- రోహిణి ( ఈ అవార్డ్‌ని బాబా భాస్కర్ చేతుల మీదుగా అందుకున్నారు)

7. సైలెంట్ కిల్లర్ అవార్డు- అషు రెడ్డి (ఈ అవార్డుని శివజ్యోతి చేతుల మీదుగా అందుకుంది)

8. బెస్ట్ ఫుటేజ్ క్వీన్ అవార్డు- హిమజ (ఈ అవార్డుని రోహిణి చేతుల మీదుగా అందుకుంది హిమజ)

9. మిస్టర్ నారద అవార్డ్- మహేష్ విట్టా (ఈ అవార్డుని తిరస్కరించాడు మహేష్ )

10. సూపర్ స్టార్ అవార్డ్- బాబా భాస్కర్ (ఈ అవార్డుని తమన్నా చేతుల మీదుగా అందుకున్నారు)

11. దివా అవార్డు- వితికా షెరు ( ఈ అవార్డుని వరుణ్ సందేశ్ చేతుల మీదుగా అందుకున్నారు ).

12. గ్యాంగ్ లీడర్ అవార్డ్- వరుణ్ సందేశ్ (ఈ అవార్డుని మహేష్ విట్టా చేతుల మీదుగా అందుకున్నారు )

13. పటాకా ఆఫ్ హౌస్- శ్రీముఖి (ఈ అవార్డుని రాహుల్ చేతుల మీదుగా అందుకుంది శ్రీముఖి. )

14. మాయలోడు అవార్డు-రవిక్రిష్ణ (ఈ అవార్డుని శివజ్యోతి చేతుల మీదుగా అందుకున్నాడు ).

15. జలపాతం అవార్డ్- శివజ్యోతి (ఈ అవార్డుని రోహిణి, అషు, రవి, అలీ, హిమజ చేతుల చేతుల మీదుగా అందుకుంది).

16. రాక్ స్టార్ అవార్డు- రాహుల్ సిప్లిగంజ్ (ఈ అవార్డుని పునర్నవి, వరుణ్, రాహుల్‌ చేతుల మీదుగా అందుకున్నారు రాహుల్)

అవార్డుల కార్య‌క్ర‌మం త‌ర్వాత ఇంటి స‌భ్యులు రికార్డింగ్ డ్యాన్స్ చేశారు. మ్యూజిక్‌కి త‌గ్గ‌ట్టుగా వెరైటీ స్టెప్స్ వేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేశారు. కొద్ది సేప‌టి త‌ర్వాత ఇంటి స‌భ్యులు తిరిగి వెళ్ళే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో అంద‌రిలో ముఖాల‌లో కాస్త దుఃఖం క‌నిపించింది. హౌజ్‌మేట్స్ అంద‌రు బ‌య‌ట‌కి వెళ్ళిన త‌ర్వాత టాప్ 5 కంటెస్టెంట్స్ కాసేపు ముచ్చ‌ట్లు పెట్టి నిద్ర‌లోకి జారుకున్నారు. ఇక నేడు మ‌న హౌజ్ మేట్స్ బిగ్ బాస్ ఫినాలే స్టేజ్‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందుకోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు .

2589
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles