త‌మిళ సినిమాకి రీమేక్‌గా బాఘీ 3..!

Tue,September 17, 2019 12:35 PM

రోజు రోజుకి సౌత్ సినిమాల స్థాయి మ‌రింత పెరుగుతుండ‌డంతో హిందీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన మేక‌ర్స్ మ‌న సినిమాలని రీమేక్ చేస్తూ మంచి విజ‌యాలు సాధిస్తున్నారు. బాఘీ ఫ్రాంచైజ్‌లో వ‌చ్చిన గ‌త‌ రెండు చిత్రాలు తెలుగు రీమేక్ చిత్రాలుగా తెర‌కెక్కి మంచి హిట్ కొట్టాయి . వ‌ర్షం సినిమాకి రీమేక్ గా హిందీలో తెరకెక్కిన బాఘి చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ మూవీకి సీక్వెల్‌గా బాఘీ2 చిత్రాన్ని తీసారు. ఇది తెలుగు సినిమా క్ష‌ణంకి రీమేక్‌గా రూపొందింది. అహ్మద్ ఖాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్ ద‌క్కించుకుంది . ఇక ఇప్పుడు బాఘీ 3 కూడా ప్లాన్ చేశారు .ఇందులోను టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా నటించనుండగా, శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయికగా న‌టిస్తుంది.


అహ్మ‌ద్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో మూడో పార్ట్ తెర‌కెక్కుతుండగా, సాజిద్ న‌డియావాలా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 2020 మార్చి 6న మూడో పార్ట్‌ విడుదల కానుంది. ఇటీవ‌ల సెట్స్ పైకి వెళ్ళిన ఈ చిత్రం ఏడు రోజుల పాటు తొలి షెడ్యూల్ జ‌రుపుకోనుండగా, సెర్బియా, జార్జియాలో త‌ర్వాతి షెడ్యూల్ మొద‌లు పెట్ట‌నున్నార‌ట‌. అక్టోబ‌ర్‌లో క్లైమాక్స్‌కి సంబంధించిన షూటింగ్‌ని ఆ ప్రాంతాల‌లో జ‌ర‌ప‌నున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. బాఘీ 3 చిత్రం త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం వెట్టైకి రీమేక్‌గా రూపొంద‌నుంద‌ని అంటున్నారు. త‌మిళంలో ఆర్ మాధ‌వ‌న్, ఆర్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో చిత్రం రూపొంద‌గా, 2012లో సినిమా విడుద‌ల అయింది. మ‌రి తాజాగా వ‌స్తున్న వార్త‌ల‌లో నిజమెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

1193
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles