మేన‌ల్లుడికి బెస్ట్ విషెస్ అందించిన మ‌హేష్

Sun,November 10, 2019 10:08 AM

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న మేన‌ల్లుడికి బెస్ట్ విషెస్ అందించారు. మ‌రి కొద్ది నిమిషాల‌లో మ‌హేష్ మేన‌ల్లుడు, గల్లా జ‌యదేవ్ కుమారుడు గ‌ల్లా అశోక్ డెబ్యూ మూవీ లాంచ్ కానుంది. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ చిత్ర బృందంతో పాటు అశోక్‌కి బెస్ట్ విషెస్ అందించారు. షూట్ తొలి రోజు.. ఎక్కువ క‌ష్ట‌ప‌డితే విజ‌యం మ‌న‌ది అవుతుంది. చిత్ర బృందం అంద‌రికి నా శుభాకాంక్ష‌లు అని మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంకి గిబ్రాన్ సంగీతం అందించ‌నున్నారు. ప‌ద్మావ‌తి గ‌ల్లా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంక‌ర్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌.. అశోక్ స‌ర‌స‌న న‌టిస్తుంది. కొద్ది నిమిషాల‌లో ప్రారంభం కానున్న ఈ చిత్ర లాంచింగ్ కార్య‌క్ర‌మానికి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, రానా ద‌గ్గుబాటితో పాటు మరి కొద్ది ప్ర‌ముఖులు ముఖ్య అతిధులుగా హాజ‌రు కానున్నారు.


1507
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles