స‌ల్మాన్ బ‌ర్త్‌డే రోజు పండంటి బిడ్డ‌కి జ‌న్మ‌నివ్వ‌నున్న అర్పిత‌

Fri,November 22, 2019 08:54 AM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోద‌రి అర్పిత 2014లో ఆయుష్ శ‌ర్మ‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజర‌య్యారు. పెళ్లి కానుక‌గా స‌ల్మాన్ త‌న చెల్ల‌కి రూ.16 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను బ‌హుమ‌తిగా ఇచ్చాడు. అర్పిత త‌న సొంత చెల్లెలు కాక‌పోయిన అంత క‌న్నా ఎక్కువ‌గా చూసుకుంటాడు బాయిజాన్. అర్పిత త‌న‌యుడు అహిల్‌ని ఎంతో గారాబం చేస్తాడు. వాళ్లింట్లో ఏ వేడుక జ‌రిగిన స‌ల్మాన్ త‌ప్ప‌క ఉంటారు. అయితే అర్పిత ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి కాగా, త్వ‌ర‌లో పండంటి బేబికి జ‌న్మ‌నివ్వ‌నుంద‌ట‌.


స‌ల్మాన్‌ని ఎంత‌గానో ప్రేమించే అర్పిత త‌న అన్న బ‌ర్త్‌డే( డిసెంబ‌ర్ 27) రోజే బిడ్డని క‌నాల‌ని భావిస్తుంద‌ట‌. ఇందుకు డాక్ట‌ర్ల‌తో కూడా చ‌ర్చ‌లు జ‌రిపింద‌ట‌. స‌ల్మాన్ బ‌ర్త్‌డే రోజైన డిసెంబ‌ర్ 27న డెలివరీ చేసేందుకు డాక్ట‌ర్స్ ఒప్పుకున్న‌ట్టు తెలుస్తుంది. అంటే డిసెంబ‌ర్ 27న స‌ల్మాన్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌తో పాటు పండంటి బిడ్డ పుట్టిన సంద‌ర్భంగా ప‌లు వేడుక‌లు ఘ‌నంగా జర‌ప‌నున్నట్టు స‌మాచారం.

2732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles