మలైకాతో వెడ్డింగ్..క్లారిటీ ఇచ్చిన అర్జున్‌కపూర్

Mon,December 2, 2019 05:39 PM


ముంబై: బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడనే సంగతి తెలిసిందే. అర్జున్ కపూర్ ప్రస్తుతం పానిపట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌తో బిజీబిజీగా ఉన్నాడు అర్జున్‌కపూర్. ఇదిలాఉంటే అర్జున్‌కపూర్, మలైకా అరోరాతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలుసార్లు కెమెరా కంటికి చిక్కడంతో త్వరలోనే ఒక్కటవ్వనున్నారనే వార్త కొన్నాళ్లుగా చక్కర్లు కొడుతోంది. మలైకాతో వివాహం విషయమై అర్జున్ కపూర్‌ను మీడియా ప్రశ్నించగా..స్పష్టత ఇచ్చాడు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని, ఒకవేళ ఉంటే మొదట ఆ విషయాన్ని మీడియాతోనే చెబుతానని చెప్పాడు. ప్రస్తుతానికి తామిద్దరికీ పెళ్లి చేసుకునే ఆలోచన ఏమీ లేదని చెప్పుకొచ్చాడు.

2252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles