అనుష్క ‘నిశ్శబ్ధం’ విడుదల తేదీ ఫిక్స్

Mon,December 2, 2019 04:45 PM


అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘నిశ్శబ్ధం’. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. స్వీటీ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా..? అని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. నిశ్శబ్ధం సినిమాను జనవరి 31, 2020 విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.


మాధవన్, అంజలి, షాలినిపాండే, అవ‌స‌రాల శ్రీనివాస్, సుబ్బ‌రాజు, హాలీవుడ్‌ స్టార్‌ మైఖెల్‌ మ్యాడసన్‌ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో సాక్షి అనే అమ్మాయి పాత్ర‌లో అనుష్క నటిస్తోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. తెలుగు, త‌మిళం, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

769
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles