సిక్స్ ప్యాక్‌లో మ‌రో కుర్ర హీరో

Sat,December 14, 2019 08:18 AM

ఒక‌ప్పుడు ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ఆరుప‌ల‌క‌ల దేహంతో సంద‌డి చేస్తే, ఇప్పుడు కుర్ర హీరోలు రామ్, నాగ శౌర్య‌, సాయిధ‌ర‌మ్ తేజ్ వంటి కుర్ర హీరోలు సిక్స్ ప్యాక్ లుక్‌లో సంద‌డి చేస్తున్నారు. హీరో రామ్ ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో సిక్స్ ప్యాక్‌లో కనిపించి సంద‌డి చేశాడు. ఇక నాగ‌శౌర్య అశ్వ‌థ్థామ చిత్రం కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. ఇక మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌ను న‌టించిన తాజా చిత్రం ప్ర‌తి రోజూ పండ‌గే చిత్రంలో సిక్స్ ప్యాక్‌లో క‌నిపించి ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇవ్వ‌నున్నాడ‌ట‌


మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌, రాశీఖ‌న్నా హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం ప్ర‌తిరోజూ పండ‌గే. స‌త్య‌రాజ్, రావుర‌మేష్‌ ముఖ్య పాత్ర‌లో కనిపించ‌నున్నారు. డిసెంబ‌ర్ 20న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ రెండు యాక్షన్‌ సీక్వెన్సెస్‌లో సిక్స్‌ప్యాక్‌ బాడీతో కనిపిస్తారు. ఈ రెండు ఫైట్లు హైలైట్‌గా నిలుస్తాయట. అయితే ఒక ఫైట్ హోమం నేపథ్యంలో వచ్చేదిగా ఉంటుంద‌ని అంటున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు.



1551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles