విక్ర‌మ్ ఫ్యామిలీ నుండి వ‌స్తున్న మ‌రో హీరో

Fri,August 23, 2019 10:08 AM
another family member of Vikram confirms debut

ఇటు తెలుగు, అటు త‌మిళ భాష‌ల‌లో త‌న న‌ట‌న‌తో ఎంద‌రో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న హీరో చియాన్ విక్ర‌మ్. ఆయ‌న త‌నయుడు ధృవ్.. అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రంతో వెండితెర‌కి ప‌రిచ‌యం కానున్న సంగ‌తి తెలిసిందే. ఆదిత్య వ‌ర్మ అనే టైటిల్‌తో త‌మిళంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుండ‌గా, అతి త్వ‌ర‌లోనే చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. క‌ట్ చేస్తే ఇప్పుడు విక్ర‌మ్ ఫ్యామిలీ నుండి మ‌రొక‌రు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. విక్ర‌మ్ చెల్లెలు అనితా త‌న‌యుడు అర్జుమాన్ పొల్ల‌ద ఉల‌గిల్ బ‌యంగ‌ర గేమ్ అనే చిత్రంతో త్వ‌ర‌లో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఆయ‌న‌కి సంబంధించిన లుక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. యాక్టింగ్‌పై చాలా ఆస‌క్తి ఉన్న నేప‌థ్యంలో అర్జుమాన్‌ని ఇండ‌స్ట్రీలోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేశార‌ట విక్ర‌మ్. అర్జుమాన్ డెబ్యూ చిత్రాన్ని విజ‌య్ శ్రీ.జి తెర‌కెక్కించ‌నుండ‌గా, జీడీఆర్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌పై నిర్మితం అవుతుంది. బిగ్ బాస్ ఫేం ఐశ్వ‌ర్య ద‌త్తా చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. మొట్టై రాజేంద్ర‌న్‌, జూలీ క్రైమ్ బ్రాంచ్ ఆఫీస‌ర్స్ పాత్ర‌లో క‌నిపించనున్నార‌ట‌. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందిస్తుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు.

2590
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles