‘ఎఫ్-2’ కు సీక్వెల్ చేయాలనుంది..

Sun,January 13, 2019 10:37 PM
Anilraavipudi wants to make F2 Sequel

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్-2 బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తో ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. వెంకీ, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతుంది.

ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో చిట్ చాట్ చేశాడు. ‘దర్శకుడిగా ఇదివరకు వాణిజ్య హంగులతో కూడిన యాక్షన్ సినిమాలు చేశాను. వాటికి భిన్నంగా పూర్తిస్థాయి వినోదభరిత కథాంశంతో ఓ సినిమా చేస్తే బాగుండునని అనిపించింది. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ లాంటి ఫ్యామిలీ ఎంటర్ తెలుగులో వచ్చి చాలా కాలమైంది. ఆ లోటును భరీ ్తచేస్తూ భార్యాభర్తల అనుబంధానికి కామెడీని జోడించి ఈ సినిమా చేశాను. మాస్ పాటు క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నది. వెంకటేష్ పాత్ర, ఆయన మేనరిజమ్స్ మంచి స్పందన లభిస్తున్నది. అలాగే బోరబండ కుర్రాడిగా వరుణ్ సహజమైన అభినయాన్ని కనబరిచాడు. బాలీవుడ్ గోల్ హౌస్ సినిమాల సీక్వెల్స్ ట్రెండ్ సృష్టించాయి. వాటి తరహాలో ‘ఎఫ్-2’ కు సీక్వెల్ చేయాలనుంది. ఈ సీక్వెల్ నటించడానికి వెంకటేష్, వరుణ్ సంసిద్ధతను వ్యక్తంచేశారని అనిల్ రావిపూడి అన్నారు.

3495
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles