న‌వంబ‌ర్ 14న లాంచ్ కానున్న ర‌వితేజ 66వ చిత్రం

Wed,November 13, 2019 08:51 AM

మాస్ రాజా రవితేజ త‌న కెరీర్‌లో స‌క్సెస్ ఫుల్‌గా 65 చిత్రాలు పూర్తి చేశాడు. ఇక 66వ చిత్రంగా గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలోఓ చిత్రం చేయ‌నున్నాడు . ఈ చిత్రం త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం థేరికి రీమేక్‌గా తెర‌కెక్క‌నుంద‌ని జోరుగా ప్రచారం జ‌రుగుతుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర ద‌ర్శ‌కుడు క్లారిటీ ఇచ్చారు. ర‌వితేజ 66వ మూవీ వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్క‌నుంది. కొన్నేళ్ళ క్రితం తెలుగు రాష్ట్రాల‌లో జ‌రిగిన రియ‌ల్ ఇన్సిడెంట్స్‌తో మూవీని తెర‌కెక్కించ‌నున్నాం అని గోపిచంద్ ఇటీవ‌ల స్ప‌ష్టం చేశారు. నవంబ‌ర్ 14న ఈ మూవీ గ్రాండ్‌గా లాంచ్ కానుంది. వెంట‌నే చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే శృతి హాస‌న్ కథానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం త‌మిళ స‌ముద్ర‌ఖ‌నిని ఎంపిక చేసింది చిత్ర బృందం. ర‌వితేజ త్వ‌ర‌లో డిస్కోరాజా చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్న విష‌యం తెలిసిందే.

1057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles