ఆసుప‌త్రిలో చేరిన అమితాబ్‌.. రెగ్యుల‌ర్ చెక‌ప్ కోసమే అంటున్న వైద్యులు

Fri,October 18, 2019 11:00 AM

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఇటీవ‌ల 77వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ని కుటుంబ స‌భ్యులు, అభిమానులు ఘ‌నంగా జ‌రిపారు. ఏడు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో యాక్టివ్‌గా ఉన్న అమితాబ్ ఈ మంగ‌ళ‌వారం ముంబైలోని నానావ‌తి ఆసుప‌త్రిలో చేరార‌ట‌. గ‌త మూడురోజులుగా ఆయ‌న‌కి ఐసీయూ తరహా సదుపాయాలుండే గదిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాలేయ సంబంధిత వ్యాధి కార‌ణంగానే ఆయ‌న ఆసుప‌త్రిలో చేరిన‌ట్టు తెలుస్తుంది. అయితే రెగ్యుల‌ర్ చెక‌ప్ కోస‌మే అమితాబ్ ఆసుప‌త్రిలో చేరార‌ర‌ని , ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం కౌన్‌బ‌నేగా క‌రోడ్ ప‌తి సీజ‌న్ 11 కార్య‌క్ర‌మంతో బిజీగా ఉన్న అమితాబ్.. సూజిత్ సర్కార్ గులాబో సితాబ్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. బ్ర‌హ్మాస్త్రా అనే చిత్రంలోను కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌ల అమితాబ్ సినిమా రంగానికి చేసిన సేవ‌ల‌కి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పొందిన విష‌యం తెలిసిందే.

772
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles