ద‌ర్శ‌కుడితో అక్ష‌య్ డిష్యూం డిష్యూం..వీడియో వైర‌ల్

Wed,November 13, 2019 08:13 AM

ఖిలాడీ కుమార్ అక్ష‌య్ కుమార్ ఏం చేసిన దాంట్లో కొంత ఫ‌న్‌తో పాటు కంటెంట్ కూడా ఉంటుంది. తాజాగా త‌నపై క‌ల్పిత వార్త రాసిన వెబ్‌సైట్‌కి అదిరిపోయే పంచ్ ఇచ్చారు అక్ష‌య్. మేటర్‌లోకి వెళితే ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న అక్ష‌య్ కుమార్..రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌వంశీ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో క‌త్రినా కైఫ్ క‌థానాయిక‌. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే బాలీవుడ్ హంగామా అనే వెబ్ సైట్ రోహిత్‌, అక్ష‌య్‌కి సంబంధించి త‌ప్పుడు క‌థ‌నం రాసింది. వీరిద్ద‌రు గొడ‌వ‌ప‌డ్డార‌ని, వీరిని క‌లిపేందుకు క‌ర‌ణ్ జోహార్ మీడియేట‌ర్‌గా వ్య‌వ‌హరిస్తున్నార‌ని రాసింది.

త‌మ‌పై త‌ప్పుడు వార్త రాసిన వెబ్‌సైట్‌కి అదిరిపోయే పంచ్ ఇచ్చేందుకు అక్ష‌య్ నిజంగానే రోహిత్‌తో గొడ‌ప‌డ్డారు. ఒక‌రినొక‌రు కొట్టుకున్న‌ట్టు న‌టించారు. ఈ త‌తంగాన్నంతా క‌త్రినా త‌న కెమెరాలో బంధించింది. వీడియో స్టార్టింగ్‌లో కత్రినా కైఫ్ స్మార్ట్‌ఫోన్‌లో ఆ తప్పుడు వార్తను చూపించారు. ‘‘వార్త చూశారు కదా, అయితే ఇప్పుడు అక్షయ్, రోహిత్ కొట్టుకోవాలి. చూడండి నిజంగానే కొట్టుకుంటున్నారు’’ అని అన్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ కాగా, అక్ష‌య్ క్రియేటివ్ థాట్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. త‌ప్పుడు వార్త రాసిన వెబ్‌సైట్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. అక్ష‌య్ కుమార్ రీసెంట్‌గా హౌజ్‌ఫుల్ 4 చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.4491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles