మ‌రో ఆస‌క్తిక‌ర పోస్ట‌ర్‌తో వచ్చిన అక్ష‌య్ కుమార్

Thu,November 14, 2019 01:34 PM

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ ఏం చేసిన చాలా కొత్త‌గా ఉంటుంది. ఆయ‌న న‌టించిన‌ సినిమాల‌లో వినోదంతో పాటు కొంత మెసేజ్ కూడా ఉంటుంది. తాజాగా అక్ష‌య్ గుడ్ న్యూస్ అనే సినిమా చేస్తున్నారు. దిల్జీత్ దొసాన్జ్, కరీనా కపూర్, కియారా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన పోస్టర్ విడుద‌ల చేశారు. ఇందులో కరీనా, కియారా ప్రెగ్నంట్ అయినట్లుగా చూపించారు. వారి మధ్య అక్షయ్, దిల్జీత్ నలిగిపోతున్నట్లు కనిపించారు. అంతేకాదు వీర్య కణాలను మార్పిడి అవుతున్న‌ట్టు కూడా చూపించారు. హిలేరియ‌స్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

గుడ్ న్యూస్ చిత్రంలో అక్షయ్ కుమార్ భార్యగా క‌రీనా.. దిల్జీత్ భార్యగా కియారా కనిపించనున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు . డిసెంబర్ 27న‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గుడ్ న్యూస్ సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకుని 2019కు వీడ్కోలు చెప్తారని అంటున్నారు అక్ష‌య్. రాజ్ మెహ‌తా చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అక్ష‌య్ రీసెంట్‌గా హౌజ్‌ఫుల్ 4 చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, కాంచ‌న రీమేక్‌గా ఆయ‌న న‌టిస్తున్న ల‌క్ష్మీ బాంబ్ సినిమా విడుద‌ల కావ‌ల‌సి ఉంది. మరోపక్క అక్షయ్ ‘సూర్యవంశీ’ సినిమాతోనూ బిజీగా ఉన్నారు. అంతేకాదు ‘బచ్చన్ పాండే’ అనే సినిమాలోనూ నటిస్తున్నారు.


1145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles