స‌రికొత్త లుక్‌లో అజిత్‌.. వైర‌ల్‌గా మారిన ఫోటోలు

Sat,October 5, 2019 11:34 AM

త‌ల అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే అజిత్ ఈ ఏడాది వ‌రుస స‌క్సెస్‌లు సాధిస్తున్నాడు. ఏడాది మొద‌ట్లో విశ్వాసం చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అజిత్ రీసెంట్‌గా నెర్కొండ పార్వాయి అనే చిత్రం చేశాడు. ఈ చిత్రం పింక్ హిందీ రీమేక్‌గా తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం త‌న 60వ సినిమా కోసం స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ చిత్రం యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నుండ‌గా, ఇందులో కొన్ని రిస్కీ స్టంట్స్ చేయాల్సి ఉంటుంద‌ట‌. ఇందుకోసం అజిత్ పూర్తి స్లిమ్‌గా మారాడు. అంతేకాదు మొన్న‌టి వ‌ర‌కు తెల్ల వెంట్రుక‌ల‌తో ఓల్డ్ లుక్‌లో క‌నిపించిన అజిత్ ప్ర‌స్తుతం యంగ్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఆరంభం(2013) సినిమా టైంలో అజిత్ ఎలా ఉన్నారో ఇప్ప‌డు అలానే ఉన్నారు అని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. అజిత్ 60వ చిత్రం కూడా వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ చిత్రంలో జాన్వీ క‌పూర్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఈ చిత్రంతో జాన్వీ త‌మిళ తెర‌కి పరిచ‌యం కానుంద‌ని చెబుతున్నారు. డిసెంబ‌ర్‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న అజిత్ 60వ చిత్రం 2020లో విడుద‌ల కానుంది.2784
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles