'రూల‌ర్' నుండి ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో వ‌చ్చేసింది

Sun,December 1, 2019 11:48 AM

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో కేఎస్ ర‌వికుమార్ తెర‌కెక్కించిన చిత్రం రూలర్. డిసెంబ‌ర్ 20న విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. . చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్రలో క‌నిపించ‌నుంది. మ‌రో 19 రోజుల‌లో సినిమా విడుద‌ల కానున్న నేప‌థ్యంలో చిత్రానికి సంబంధించి భారీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కి భారీ రెస్పాన్స్ రాగా, తాజాగా చిత్రం నుండి అడుగ‌డుగో యాక్ష‌న్ హీరో అనే లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు. రామ‌జోగయ్య శాస్త్రి ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా, సాయిచ‌ర‌ణ్ భాస్క‌రుని ఆల‌పించారు. మీరు ఈ పాట‌ని విని ఆనందించండి

1293
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles