మరో సినిమాకు సిమ్రాన్ గ్రీన్ సిగ్నల్

Thu,January 17, 2019 10:56 PM
Actress simran okays another project

కోలీవుడ్, టాలీవుడ్ లో అగ్రతారలందరితో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగువెలిగింది సిమ్రాన్. ఈ సీనియర్ హీరోయిన్ సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే రజనీకాంత్ పేటా చిత్రంలో తళుక్కున మెరిసి అందరిని అలరించింది. తాజాగా మరో ప్రతిష్టాత్మక చిత్రానికి సిమ్రాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణ్ కథ ఆధారంగా తీయనున్న 'రాకెట్రీ..ది నంబీ ఎఫెక్ట్' చిత్రంలో సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటించేందుకు ఒకే చెప్పినట్లు టాక్. అమృత సినిమాలో కలిసి నటించిన మాధవన్, సిమ్రాన్ మరోసారి ఈ సినిమాతో సిల్వర్ స్ర్కీన్ పై మెరవనున్నారు.

2654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles