నేను ఇంకా చిన్న పిల్లాడినే, తండ్రి పాత్ర ఏంటి?

Tue,November 19, 2019 08:05 AM

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌లో ఏ ఒక్క‌టి నిజం కావ‌డం లేదు. కొద్ది రోజుల క్రితం వ‌రుణ్ తేజ్‌- కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో మాధ‌వ‌న్ న‌టిస్తున్నాడ‌ని, ఆయ‌న వ‌రుణ్‌కి తండ్రిగా క‌నిపించ‌నున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఓ నెటిజ‌న్.. ఏంటీ, నిజంగా మాధ‌వ‌న్ తండ్రి పాత్ర పోషిస్తున్నారా.. ఇది ఫేక్ అని నేను న‌మ్ముతాను అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి మాధ‌వ‌న్ స్పందిస్తూ.. టోట‌ల్లీ ఫేక్ బ్రో.. నేను ఇంకా చిన్న పిల్లాడినే అని చెప్పి పుకార్ల‌కి పులిస్టాప్ పెట్టారు. ఇక వ‌రుణ్ త‌ల్లిగా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంద‌ని కూడా ప్ర‌చారం జ‌ర‌గ‌గా, దీనిపై ఎప్పుడు క్లారిటీ వ‌స్తుందో చూడాలి. వ‌రుణ్ ప‌ద‌వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రినైసాన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు.

1567
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles