భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో 44 ఏళ్ళ సుదీర్ఘ ప్ర‌యాణం

Fri,November 22, 2019 10:43 AM

ఫైర్ బ్రాండ్‌కి కేరాఫ్ అడ్రెస్ మంచు మోహన్ బాబు. క‌లెక్ష‌న్ కింగ్‌, డైలాగ్ కింగ్, ప‌ద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హీత‌, ఫిలిం ఫేర్ అవార్డ్ గ్ర‌హీత‌, కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ నుండి డాక్ట‌రేట్ అందుకున్న వ్య‌క్తి.. ఇలా మోహ‌న్ బాబు సాధించిన ఘ‌న‌త‌లు ఎన్నో ఉన్నాయి. ఆయ‌న రూటే స‌ప‌రేటు. ఆయ‌న మాట‌ల్లో గాంభీర్యం, డైలాగులకు అనుగుణంగా హావభావాలు , యాక్టింగ్ లో అదరగొట్టడం మోహ‌న్ బాబు సొంతం. విల‌న్‌గా, నటుడిగా విభిన్న పాత్ర‌లు పోషించిన మోహ‌న్ బాబు 573 సినిమాల్లో నటించాడు. 75కి పైగా సినిమాలు నిర్మించాడు. 20కి పైగా వేరే భాషా సినిమాల‌లో న‌టించారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. ఇప్ప‌టికి అడ‌పాద‌డపా పాత్ర‌ల‌లో క‌నిపిస్తూనే ఉన్నాడు. అయితే ఆయ‌న నేటితో త‌న 44 ఏళ్ళ సినీ కెరీర్ పూర్తి చేసుకున్నాడు. 1975 న‌వంబ‌ర్ 22న విడుద‌లైన స్వ‌ర్గం న‌ర‌కం అనే సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయ్యారు మోహ‌న్ బాబు. ఈ చిత్రాన్ని దాస‌రి నారాయ‌ణ రావు తెర‌కెక్కించారు.


కెరీర్ మొద‌ట్లోనే దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణ రావు శిష్యుడిగా గుర్తింపు పొందిన మోహ‌న్ బాబు అనేక హిట్‌ చిత్రాల్లో నటించి సినిమా నిర్మాతగా కూడా మారి ల‌క్ష్మీ ప్ర‌స‌న్న ఆర్ట్ పిక్చర్స్ అనే బేన‌ర్‌ని స్థాపించాడు. ఈ బేన‌ర్‌పై ప‌లు హిట్ సినిమాలు చేశాడు . మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశాడు. విలన్‌గా, క్యారెక్టర్‌ నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సినీ ప‌రిశ్రమ‌లో త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎన్నో అవార్డులు అందుకున్నారు. క‌ళామ్మ త‌ల్లి ముద్దుబిడ్డ‌గా ఉన్న మోహ‌న్ బాబు 44 సంవ‌త్స‌రాల సినీ ప్ర‌యాణంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు ఉన్నాయి. అరుదైన ఘ‌న‌త సాధించిన మోహ‌న్ బాబుకి ప‌లువురు సెల‌బ్రిటీలు, అభిమానులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. #44YearsOfMB హ్యాగ్ ట్యాగ్ తో అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.

1378
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles