ప్ర‌భాస్ సినిమా కోసం 25 సెట్స్‌

Thu,September 12, 2019 10:50 AM
25 sets for prabhas next movie

బాహుబ‌లి చిత్రం త‌ర్వాత సాహో వంటి భారీ బ‌డ్జెట్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ప్ర‌భాస్ ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని కాస్త నిరాశ‌ప‌రిచాడ‌నే చెప్ప‌వ‌చ్చు. సాహో చిత్రంపై అభిమానులు ఎన్నో ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకొని ఉండ‌గా, అవ‌న్నీ ఆవిరైపోయాయి. అయితే ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం అందించ‌డం ఖాయం అని అంటున్నారు.

ప్ర‌భాస్ త‌న 20వ చిత్రంగా కె కె రాధా కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న‌ ఈ చిత్రం 1970 బ్యాక్ డ్రాప్ నేప‌థ్యంలో రూపొందుతున్న‌ట్టు స‌మాచారం. చిత్రానికి జాన్ అనే టైటిల్‌ని క‌న్‌ఫాం చేసిన‌ట్టు తెలుస్తుంది. దాదాపు 180 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి 25 సెట్స్ వేసిన‌ట్టు తాజా స‌మాచారం. అతి త్వ‌రలోనే చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానుంద‌ని అంటున్నారు.

2537
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles