రెండేళ్ళు పూర్తి చేసుకున్న‌ రాజా ది గ్రేట్

Fri,October 18, 2019 11:17 AM

మాస్ మహారాజా రవితేజ, యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం రాజా ది గ్రేట్. గ‌త ఏడాది అక్టోబర్ 18న దీపావళి శుభాకాంక్షలతో విడుద‌లైన ఈ చిత్రం అందరి ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ చిత్రంలో కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ హంగులే కాకుండా స‌మాజంకి ఉప‌యోగ‌ప‌డే స‌న్నివేశాలు కూడా ఉన్నాయి. మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో రాధిక ముఖ్య పాత్ర పోషించారు. నాకు క‌న‌ప‌డదు స‌ర్‌, ఇట్స్ లాఫింగ్ టైమ్, జ‌కాస్‌, ఐయామ్ బ్లైండ్‌.. బ‌ట్ ఐయామ్ ట్రైండ్‌, గున్న‌మామిడి సాంగ్ ఇలా త‌దిత‌ర అంశాలు సినిమాని ఓ రేంజ్‌లో నిలిచేలా చేశాయి. బెంగాల్ టైగ‌ర్ చిత్రం త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకొని ర‌వితేజ ఈ చిత్రంలో న‌టించారు. ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో వ‌రుస సినిమాలు చేశారు ర‌వితేజ‌. ఇందులో ఒక్క చిత్రం కూడా ర‌వితేజ‌కి మంచి విజ‌యాన్ని అందించ‌లేదు. ప్ర‌స్తుతం ర‌వితేజ డిస్కోరాజా చిత్రాన్ని చేస్తుండ‌గా, అనీల్ రావిపూడి.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో స‌రిలేరు నీకెవ్వ‌రు అనే చిత్రాన్ని చేస్తున్నాడు.




1997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles