100 % ల‌వ్ త‌మిళ రీమేక్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Sat,September 14, 2019 10:06 AM

నాగ చైత‌న్య‌- త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కించిన సూప‌ర్ హిట్ చిత్రం 100% ల‌వ్. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ప‌లు భాష‌ల‌లో రీమేక్ చేయాల‌ని అప్ప‌ట్లో ప్ర‌య‌త్నాలు చేశారు. హిందీలో వారి ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోయిన‌ప్ప‌టికి తమిళంలో మాత్రం త‌న శిష్యుడైన చంద్ర‌మౌళితో ఈ సినిమా రీమేక్ చేస్తున్నాడు సుక్కూ. త‌మిళ వ‌ర్షెన్ లో జీవి ప్ర‌కాశ్ కుమార్ , షాలిని పాండే ప్ర‌ధాన పాత్ర‌లుగా ఈ చిత్రం రూపొందుతున్న ఈ చిత్రానికి 100% కాద‌ల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో స‌న్నివేశాలు అచ్చం తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించిన‌ట్టే ఉండ‌గా,అక్క‌డ కూడా ఈ సినిమా మంచి విజ‌యం సాధించనుంద‌ని టీం భావిస్తుంది. చిత్రానికి జీవి ప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అయితే చిత్రం ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన‌ప్ప‌టికి ప‌లు స‌మ‌స్య‌ల వ‌ల‌న రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేసిన టీం మ‌ళ్లీ ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. చిత్రం రిలీజ్ తేది వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ అంటున్నారు.


1207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles