Tesla Cars Delivery | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 2,41,300 కార్లను డెలివరీ చేశామని గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రకటించింది. మూడో త్రైమాసికంలో కార్ల తయారీ, కొనుగోలు దారులకు కార్ల డెలివరీలో నూతన రికార్డులు నెలకొల్పినట్లు తెలిపింది. గమ్మత్తేమిటంటే ప్రస్తుతం సెమీ కండక్టర్లు, చిప్‌ల కొరతతో గాడ్జెట్స్తోపాటు ఆటోమొబైల్ ప్రత్యేకించి కార్ల తయారీ సంస్థలు ఉత్పత్తిలో కోత విధించాయి. కస్టమర్లకు కార్ల డెలివరీ కూడా రీ షెడ్యూల్ చేస్తున్న తరుణంలో టెస్లా రికార్డు స్థాయిలో 2,43,300 ఎలక్ట్రిక్ కార్లను కస్టమర్లకు డెలివరీ చేసినట్లు పేర్కొనడం గమనార్హం. ఇదే ఏడాది రెండో త్రైమాసికంలో 2,01,250 మందికి టెస్లా కార్లను డెలివరీ చేసింది.
కార్ల డెలివరీలో ఈ నెల క్రేజియెస్ట్ నెలగా నిలిచిపోతుందని కంపెనీ ఎంప్లాయిస్‌తో వైడ్ కాల్లో టెస్లా సీఈవో ఎలన్ మస్క్ పేర్కొనడం గమనార్హం. ఉత్పత్తిలో ఇబ్బందుల వల్ల టెస్లా కార్ల సప్లయ్ చైన్‌లో సమస్యలు తలెత్తుతాయని, కార్ల డెలివరీ జాప్యం అవుతుందని సీఈవో నొక్కి చెప్పారు.
టెస్లా కార్ల సప్లయ్ నెట్వర్క్ ప్రతి క్వార్టర్ చివరిలోనే ఎక్కువ కార్లను డెలివరీ చేయడం సంప్రదాయంగా వస్తోంది. కానీ, ప్రస్తుత త్రైమాసికంలో ఉత్పత్తి సమస్యలు సమస్యగా పరిణమించనున్నాయని తెలుస్తోంది. కానీ కొన్ని రోజుల క్రితం ఎలన్ మస్క్ స్పందిస్తూ.. ఈ నెలలో కార్ల డెలివరీ తీవ్రంగా పెరుగుతుందని పేర్కొనడం గమనార్హం.