చెన్నై, జూలై 3: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. ఇంటివద్దనే హెల్త్‌కేర్ సేవలు ప్రారంభించింది. కస్టమర్లకు ఇంటి వద్దనే ఆరోగ్యానికి సంబంధించిన సేవలు అందించాలనే ఉద్దేశంతో కేర్24, పోర్టీ, కాల్హెల్త్, అతుల్య హోమ్‌కేర్, అర్గాల వంటి సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
ఇంటి వద్దనే జ్వరం, గ్యాస్ట్రో సమస్యలు, మూత్ర నాళల్లో ఇన్ఫెక్షన్ వంటి రోగులకు చికిత్స అందించనున్నారు. ఈ సేవలకోసం టోల్-ఫ్రీ నంబర్ 044-69006900 లేదా స్టార్ హెల్త్ మొబైల్ యాప్‌ను సంప్రదించాలని సూచించింది.
ఇలా సంప్రదించిన వారికి వీలైనంత త్వరగా డాక్టర్ వారి దగ్గరికి వచ్చి చికిత్స చేయనున్నారు. ఐదు రోజులపాటు చికిత్స కోసం డాక్టర్ ఫీజుతోపాటు నర్స్‌కు అయ్యే రూ.7000-7,500 ఖర్చు ను సమ్ అస్యూర్డ్ కింద కట్ చేసుకోనున్నారు.