మనలో చాలామంది క్రెడిట్ కార్డ్స్ వాడుతూంటారు. నిజానికి ఇప్పుడిదో నిత్యవసర వస్తువైపోయింది. అలాంటి ఈ క్రెడిట్ కార్డుల్లో ఎన్ని రకాలున్నాయో.. వాటి లాభాలేంటో మీకు తెలుసా?
బేసిక్ క్రెడిట్ కార్డ్స్
వీటిని చాలా బ్యాంకులు, సంస్థలు తమ కస్టమర్లకు ఉచితంగానే ఇస్తున్నాయి. మరికొన్ని తక్కువ ఫీజును వసూలు చేస్తున్నాయి. అయితే ఇందులో పెద్దగా బెనిఫిట్స్ ఏవీ ఉండవు.
రివార్డ్ పాయింట్లతో..
క్రెడిట్ కార్డ్స్‌ను ఎక్కువగా వాడేవారికి రివార్డ్ క్రెడిట్ కార్డులు ఫేవరేట్‌గా ఉంటాయి. ప్రతీ కొనుగోలుపై రీడిమబుల్ రివార్డ్స్ యాడ్ అవుతాయి.
క్యాష్‌బ్యాక్‌తో..
క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులతో మనం కొనే వస్తువుల ధర కొంత మొత్తం తగ్గుతుంది. మన అకౌంట్లలో ఆ మొత్తాలు జమవుతాయి.
ప్రయాణాల కోసం..
ప్రయాణాలు ఎక్కువగా చేసేవారి కోసం ట్రావెల్ క్రెడిట్ కార్డులూ ఉన్నాయి. వీటితో ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, హోటల్ చార్జీల్లో రాయితీ వంటివి అందుకోవచ్చు.
వ్యాపారులకు..
వ్యాపారులు, కంపెనీల యజమానుల కోసం బిజినెస్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు. వ్యాపార లావాదేవీలపై రివార్డ్స్లుంటాయి.
మరికొన్నింటిలో..
పరిమిత రుణ చరిత్ర ఉన్నవారు, యువతకు స్టూడెంట్ క్రెడిట్ కార్డ్స్ లాభదాయకంగా ఉంటాయి. వీటిపై చాలావరకు వార్షిక చార్జీలుండవు. ఖర్చులపై బోనస్ పాయింట్లు వస్తాయి.సెక్యూరిటీపైనా క్రెడిట్ కార్డులను పొందవచ్చు. క్రెడిట్ స్కోర్‌తో సంబంధం లేకుండా నగదు గ్యారెంటీతో వీటిని జారీ చేస్తారు. అలాగే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్‌తో ఉచిత హోటల్ సర్వీసునూ అందుకోవచ్చు. పెద్ద మొత్తంలో రివార్డ్స్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే హై ఎండ్ కస్టమర్లకే ఇవి దొరుకుతాయి.
కాగా, రిటైల్ స్టోర్ల ద్వారా స్టోర్ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ అవుతున్నాయి. ఎక్కడైతే లేదా ఎవరైతే ఇస్తారో అక్కడే ఈ క్రెడిట్ కార్డ్స్ చెల్లుతాయి. మరోవైపు ఆన్లైన్, ఆఫ్‌లైన్ షాపర్స్‌కు షాపింగ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. వీటితో కొంటే డిస్కౌంట్లు, రివార్డులు, క్యాష్‌బ్యాక్ వంటి రకరకాల ఆఫర్లను అందుకోవచ్చు. అంతేగాక విమానయాన సంస్థలతో కలిసి బ్యాంకులు ఎయిర్‌లైన్ క్రెడిట్ కార్డ్స్‌ను ఇష్యూ చేస్తున్నాయి. విమాన టిక్కెట్ల ధరపై రాయితీలు, రివార్డ్ పాయింట్లు అందుతాయి. వాహనాల్లో ఎక్కువగా జర్నీ చేసేవారి కోసం ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్, సినిమాలకు తరచూ వెళ్లేవారి కోసం కూడా క్రెడిట్ కార్డులున్నాయి. ఎంటర్టైన్మెంట్ క్రెడిట్ కార్డులతో ఫ్రీ ఆఫర్లు, డిస్కౌంట్లు, రివార్డులు లభిస్తాయి.