Jio | ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో తన టారిఫ్ ప్లాన్లను సవరించడంతోపాటు కొత్త ప్లాన్లు తీసుకొచ్చింది. ఈ నెల మూడో తేదీ నుంచి ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలను పెంచిన జియో.. తాజాగా ఓటీటీ బెనిఫిట్లతో కూడిన ఎంటర్ టైన్ మెంట్ ప్లాన్లనూ సవరించింది. గతంలో 21 ఎంటర్ టైన్ మెంట్ ప్లాన్లు ఉంటే.. ఇప్పుడు వాటిని ఏడింటికి పరిమితం చేసింది. ఇప్పటి వరకూ రూ.3662తో సోనీ లివ్, జీ5 సబ్ స్క్రిప్షన్ (2.5 జీబీ), రూ.3226లతో సోనీ లివ్ సబ్ స్క్రిప్షన్ (2 జీబీ), రూ.3225లతో జీ5 సబ్ స్క్రిప్షన్ (2 జీబీ), రూ.3,227లకు (2 జీబీ) ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్, రూ. 3178లతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్లూ ఉన్నాయి. వీటితోపాటు దీర్ఘకాలిక ప్లాన్ రూ.4498లకు ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ తదితర 15 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్లు ఉన్నాయి. తాజాగా దీర్ఘకాలిక ప్లాన్లన్నీ తొలగించేసింది.
సవరించిన ప్లాన్ల ప్రకారం జియో ఏడు ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉంచింది. సోనీ లివ్, జీ5 సబ్ స్క్రిప్షన్ వంటి 12 రకాల ఓటీటీ ప్లాట్ ఫామ్స్ బెనిఫిట్స్‌తో రూ.175లకు 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు రెండు ప్లాన్లు మాత్రమే కొనసాగిస్తున్నది. 84 రోజులకు రోజూ 2జీబీ డేటాతో రూ.1299 ప్లాన్, రూ.1799లకు 3జీబీ ప్లాన్ ఉన్నాయి. వీటితోపాటు 84 రోజుల పాటు రోజూ 2జీబీ డేటా బెనిఫిట్ తో రూ.1029లకు ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తో జియో మరో ప్లాన్ తెచ్చింది. ఇక రోజూ 2.5 జీబీ వ్యాలిడిటీతో రూ.3999లకు ఫ్యాన్ కోడ్ సబ్ స్క్రిప్షన్, సంగీత ప్రియుల కోసం రూ.889 లేదా రూ.329లకు జియో సావన్ ప్రో ప్లాన్లు ఉన్నాయి.