Realme C63 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) మరో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ సీ63 (Realme C63) ఫోన్ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఎయిర్ గెశ్చర్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ వంటి పలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బేస్డ్ ఫీచర్లతో వస్తున్న ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ ఇది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో అందుబాటులో ఉంటుంది. ఈ వారాంతంలో సేల్స్ ప్రారంభం అవుతాయి.
రియల్ మీ సీ63 (Realme C63) ఫోన్ సింగిల్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,999లకు లభిస్తుంది. జూలై మూడో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్, రియల్మీ ఇండియా వెబ్ సైట్, సెలెక్ట్ రిటైల్ స్టోర్లలో ఫస్ట్ సేల్స్ ప్రారంభం అవుతాయి. ఈ ఫోన్ రెండు రంగులు – జేడ్ గ్రీన్, లెదర్ బ్లూ రంగులతోపాటు వెగాన్ లెదర్ ఫినిష్తో వస్తోంది. ఎయిర్ గెశ్చర్ వంటి ఏఐ ఫీచర్ వల్ల స్క్రీన్ టచ్ చేయకుండానే ఫోన్ వాడొచ్చు. కొలాప్సబుల్ మినీ క్యాప్సూల్ ఫీచర్ తో నోటిఫికేషన్లు, అలర్ట్స్ వస్తాయి. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 90 నిమిషాల్లో బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ అవుతుంది.
రియల్ మీ సీ 63 ఫోన్ ఒక్టాకోర్ యూనిసోక్ టీ613 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్ మీ యూఐ 5 వర్షన్ పై పని చేస్తుంది. డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ విషయంలో ఐపీ 54 రేటింగ్ కలిగి ఉంది. ఈ ఫోన్ 6.74 అంగుళాల హెచ్డీ+ స్క్రీన్ విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ తో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8-మెగా పిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంటాయి.