CBDT | కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్గా రవి అగర్వాల్ శనివారం నియమితులయ్యారు. ఆదాయం పన్ను విభాగం క్యాడర్లో 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన రవి అగర్వాల్ ను సీబీడీటీ చైర్మన్ గా కేంద్రం నియమించింది. 2023 జూలై నుంచి సీబీడీటీ (అడ్మినిస్ట్రేషన్) సభ్యుడిగా రవి అగర్వాల్ పని చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ మేరకు సీబీడీటీ చైర్మన్ గా రవి అగర్వాల్ ను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. జూలై ఒకటో తేదీన ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.
సెప్టెంబర్ 30 తో రవి అగర్వాల్ పదవీ కాలం ముగియనున్నది. అటుపై కేంద్ర ప్రభుత్వ అధికారుల పున: నియామకం కోసం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 2025 జూన్ 30 వరకు రవి అగర్వాల్ ను పున: నియమించే అవకాశం ఉంది. 1986 ఐఆర్ఎస్ క్యాడర్ అధికారి నితిన్ గుప్తా స్థానంలో రవి అగర్వాల్ నియమితులయ్యారు. సీబీడీటీ చైర్మన్గా నితిన్ గుప్తా 2022 జూన్ లో నియమితులయ్యారు. గతేడాది సెప్టెంబర్ 30న ఆయన పదవీ కాలం ముగిసినా 2024 జూన్ 30 వరకూ ఆయన పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది.
Tata Motors | ఆరేండ్లలో 60 లక్షల కార్ల విక్రయాలు.. ఇదీ టాటా మోటార్స్ బ్లూ ప్రింట్ ..!
Maruti Suzuki Swift | మారుతి ‘సిగ’లో మరో మైలురాయి.. 30 లక్షలు దాటిన ‘స్విఫ్ట్’ సేల్స్..!
Bharti Airtel | ఎయిర్ టెల్ టారిఫ్ ప్లాన్ల మోత.. 20 శాతం వరకూ పెంపు..
July Bank Holidays | జూలైలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. .ఇవీ డిటైల్స్..!
Realme C61 5G | రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్మీ సీ 61 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!