హైదరాబాద్, జూలై 2: మానవ వనరుల సేవలు అందించే ఫినోమ్.. అమెరికా కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న టైడీని హస్తగతం చేసుకున్నది. ఆర్థిక వివరాలు మాత్రం సంస్థ వెల్లడించలేదు.
ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శివానంద్ మాట్లాడుతూ.. మానవ వనరులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వచ్చే రెండేండ్లకాలంలో మరో వెయ్యి మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌లో రెండు, వైజాగ్‌లో ఒక కార్యాలయం ఉండగా, వీటిలో 950 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు వైజాగ్‌లో మరో కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నది.