Ola Electric Offers | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన ఎస్1 (S1) ఈవీ స్కూటర్లపై రూ.15 వేలవరకూ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ‘ఓలా ఎలక్ట్రిక్ రష్’ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 26 వరకూ కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఎస్1ఎక్స్+ స్కూటర్‌పై ఫ్లాట్ డిస్కౌంట్ రూ.5,000, క్రెడిట్ కార్డు ఈఎంఐలతో కొనుగోలు చేస్తే రూ.5000 క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ బోనస్ రూ.5000 (క్రెడిట్ కార్డు ఈఎంఐలపై కొనుగోలు చేసిన వారికి) అందిస్తోంది. సెలెక్డెడ్ బ్యాంకుల ద్వారా రుణం ద్వారా ఓలా ఎక్స్1 ఎక్స్+ (Ola S1X+) స్కూటర్‌ను కొనుక్కుంటే రూ.5000 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది.
ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2000 విలువైన ఫ్రీ సర్వీసులతోపాటు ఫ్రీ ఓలా కేర్ + సబ్స్క్రిప్షన్ అందిస్తోంది. దీంతోపాటు యాన్యువల్ కాంప్రహెన్సివ్ డయాగ్నసిస్, సర్వీస్ పికప్ అండ్ డ్రాప్, థెఫ్ట్ అండ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా అందుతుంది. సెలెక్టెడ్ క్రెడిట్ కార్డులపై ఈఎంఐల ద్వారా ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ స్కూటర్లు కొనుగోలు చేసిన వారికీ రూ.5,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది.
ఇది కూడా చదవండి : Infinix Note 40 5G | 108 మెగా పిక్సెల్ కెమెరాతో ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ.. ధరెంతో తెలుసా..?!
ఎటువంటి అదనపు కాస్ట్ లేకుండా మొత్తం ఓలా స్కూటర్లపై ఎనిమిదేండ్లు లేదా 80 వేల కిలోమీటర్ల ప్రయాణం వరకూ బ్యాటరీ వారంటీ అందిస్తోంది ఓలా ఎలక్ట్రిక్. కస్టమర్లు యాడ్ ఆన్ వారంటీ ఆప్షన్ ఎంచుకుంటే రూ.4,999 చెల్లిస్తే లక్ష కి.మీ వరకూ, రూ.12,999 చెల్లిస్తే 1.25 లక్షల కి.మీ వరకూ బ్యాటరీ వారంటీ ఆఫర్ చేస్తోంది. ఇక మూడు కిలోవాట్ల ఫాస్ట్ చార్జర్ యాక్సెసరీ రూ.29,999లకే ఓలా ఎలక్ట్రిక్ అందుబాటులోకి తెచ్చింది.
ఇది కూడా చదవండి : Oppo A3 Pro | ఒప్పో నుంచి మరో బడ్జెట్ ఫోన్ ఒప్పో ఏ3 ప్రో.. ఇవీ స్పెషిఫికేషన్స్..!