హైదరాబాద్, జూన్ 26: అంతర్జాతీయ కన్జ్యూమర్ హెల్త్‌కేర్ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రముఖ ఫార్మా సంస్థ రెడ్డీస్ ల్యాబ్ మరో సంస్థను కొనుగోలు చేసింది. నికోటినెల్, దాని అనుబంధ పోర్ట్‌ఫోలియో ఉత్పత్తులను హస్తగతం చేసుకున్నది. అంతర్జాతీయ ఎన్ఆర్టీ బ్రాండ్ నికోటినెల్, నికాబేట్, హబిట్రోల్, థ్రైవ్ వంటి బ్రాండ్లు ఇక రెడ్డీస్ పరిధిలోకి రానున్నాయి. ఒప్పందం విలువ రూ.5 వేల కోట్లకు పైనే. ఈ ఒప్పందం ఈ ఏడాది చివరి త్రైమాసికం నాటికి పూర్తికానున్నది.