Netflix | ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ తన సబ్ స్క్రైబర్ బేస్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఫ్రీ ప్లాన్ తేవాలని భావిస్తున్నది. రూపాయి కూడా చెల్లించకుండా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్‌గా చేరొచ్చు. కానీ కంటెంట్ చూడాలంటే యాడ్స్ కూడా వీక్షించాలి. సెలెక్టెడ్ మార్కెట్లలో నెట్‌ఫ్లిక్స్ ఈ ప్లాన్ తీసుకొస్తుందని బ్లూంబర్గ్ తెలిపింది. ఆసియాతోపాటు ఈయూ దేశాల్లో ఈ ఫ్రీ ప్లాన్ తేవాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తుందని సమాచారం.
ఉచితంగా టీవీ చానెల్స్ ప్రసారమవుతున్న దేశాల్లో ఈ ప్లాన్ అమలు చేయాలని నెట్‌ఫ్లిక్స్ యోచిస్తున్నదని పేర్కొన్నా బ్లూంబర్గ్ ఆ వివరాలు తెలుపలేదు. కెన్యాలో ప్రయోగాత్మకంగా పరీక్షించినా తదుపరి నిలిపేసింది. ఈ ప్లాన్ అమెరికాలో అమలు చేసే ఉద్దేశమే లేదని స్పష్టం చేసింది. డబ్బు చెల్లించి కంటెంట్ చూడలేని వారిని యాడ్స్‌తో కూడిన ఫ్రీ ప్లాన్ ద్వారా చేరువ కావాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. తద్వారా నెట్‌ఫ్లిక్స్ తన ఆదాయం పెంచుకునేందుకు వీలు కలుగుతుందని తెలుస్తోంది.
Nissan new X-Trail SUV | ఆ ఐదు ఎస్‌యూవీలకు పోటీగా నిసాన్ న్యూ ఎక్స్-ట్రయల్.. వచ్చేనెలలో ఆవిష్కరణ..!
Royal Enfield | ఎన్ఫీల్డ్కు పోటీగా బ్రిటన్ కంపెనీ సై ..త్వరలో సరికొత్త మోటారు సైకిల్..?!
Hyundai Verna | మారుతి సియాజ్.. హోండా సిటీతో పోలిస్తే.. ఈ కారు మిడ్ సైజ్ సెడాన్ కార్లలో బెస్ట్ ..
OnePlus Nord CE 4 Lite | వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోన్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ ఆగయా.. ధరెంతో తెలుసా..?!
Hyundai CNG Car | త్వరలో హ్యుండాయ్ నుంచి డ్యుయల్ సిలిండర్ సీఎన్జీ కారు.. !