Maruti Fronx Velocity Edition | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ఫ్రాంక్స్ న్యూ ట్రిమ్ కారు ‘మారుతి సుజుకి ఫ్రాంక్స్ వెలోసిటీ ఎడిషన్’ ను ఆవిష్కరించింది. స్టాండర్డ్ ఫ్రాంక్స్ కారుతో పోలిస్తే కొన్ని అప్ డేట్స్ తో వస్తోంది ఫ్రాంక్స్ వెలోసిటీ ఎడిషన్. ఈ కారు ధర రూ.7.29 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
మారుతి సుజుకి వెలోసిటీ ఎడిషన్ .. సిగ్మా, డెల్టా, డెల్టా+, డెల్టా + (ఓ), డెల్టా + టర్బో, జెటా, ఆల్ఫా వేరియంట్లలో వస్తోంది. సిగ్మా వేరియంట్ ఫ్రంట్ బంపర్‌పై బ్లాక్ రెడ్ గార్నిష్, రేడియేటర్ గ్రిల్లె, హెడ్ ల్యాంప్స్, వీల్ ఆర్చెస్ ఉంటాయి. డెల్టా, డెల్టా +, డెల్టా+ (ఓ) వేరియంట్లు రెడ్ కలర్డ్ సైడ్ బాడీ, రేర్ బంపర్ ట్రిమ్స్, రేర్ స్పాయిలర్ ఎక్స్టెన్షన్, రెడ్ ఓఆర్వీఎం కవర్స్, డోర్ విజర్స్, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్స్, రెడ్ డిజైనర్ మ్యాట్స్ తదితర ఫీచర్లు ఉంటాయి. డెల్టా + టర్బో వేరియంట్ కారు బ్లాక్ సీట్ కవర్స్, కార్బన్ ఫినిష్ ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, జెటా అండ్ ఆల్ఫా వేరియంట్లు బోర్డాక్స్ ఫినిష్ సీట్ కవర్స్‌తో వస్తున్నాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ వెలోసిటీ ఎడిషన్ కారు పెట్రోల్, పెట్రోల్ -సీఎన్జీ పవర్ ట్రైన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ ఫ్రాంక్స్ వెలోసిటీ ఎడిషన్ రెండు వేర్వేరు ఇంజిన్ చాయిస్‌లతో వస్తుంది. అందులో 1.0 లీటర్ల టర్బో చార్జ్డ్ ఇంజిన్, 1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ కలిగి ఉంటాయి. ఫ్యాక్టరీ ఫిటెడ్ సీఎన్జీ కిట్ తోపాటు 1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది.
Samsung Galaxy S24 Ultra | టైటానియం ఎల్లో కలర్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా.. ఇవీ డిటైల్స్..!
SBI | ఈ ఏడాది కొత్తగా 400 శాఖలు ప్రారంభిస్తాం.. తేల్చేసిన ఎస్బీఐ చైర్మన్ ఖరా..!
Citroen C3 Aircross | సిట్రోన్ బంపరాఫర్.. సీ3 ఎయిర్ క్రాస్‌పై రూ.2.62 లక్షల వరకూ డిస్కౌంట్..!