Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.89 లక్షల కోట్లు పెరిగింది. ఈక్విటీల్లో బుల్ ర్యాలీకి అనుగుణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ధి పొందింది. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1822.83 (2.36 శాతం) పాయింట్లు వృద్ధి చెందింది. జూన్ నెలలో బీఎస్ఈ సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 7.14 శాతం పుంజుకున్నది. గురువారం సెన్సెక్స్ చారిత్రకంగా 79 వేల మార్కును దాటింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ లబ్ధి పొందాయి. కేవలం భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మాత్రమే నష్టపోయింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,52,264.63 కోట్లు పుంజుకుని రూ.21,18,951.20 కోట్లకు చేరుకున్నది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.34,733.64 కోట్లు వృద్ధి చెంది రూ.14,12,845.09 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,286.99 కోట్లు పెరిగి రూ.8,44,201.88 కోట్ల వద్ద స్థిర పడింది.
భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.18,267.7 కోట్లు పుంజుకుని రూ.8,22,530.35 కోట్ల వద్ద నిలిచింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.14,656.3 కోట్లు పెరిగి రూ.6,50,602.10 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,808.74 కోట్లు వృద్ధితో రూ.12,80,865.43 కోట్ల వద్ద ముగిసింది.
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,111.14 కోట్లు వృద్ధితో రూ.7,57,565.68 కోట్లకు చేరింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.5,81,570.83 కోట్ల వద్ద నిలిచింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.6,616.91 కోట్లు పెరిగి రూ.5,30,475.82 కోట్లకు చేరింది. ఇక భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,042.61 కోట్ల నష్టంతో రూ.6,25,573.90 కోట్లతో సరిపెట్టుకున్నది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్ 10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఇన్ఫోసిస్, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ నిలిచాయి.
Oppo Reno 12F 5G | ఒప్పో ప్రీమియం ఫోన్ ఒప్పో రెనో 12ఎఫ్ 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
World Bank | గ్రీన్ ఎనర్జీ కోసం భారత్కు ప్రపంచ బ్యాంకు 150 కోట్ల డాలర్ల రుణం..!
Bharti Airtel | ఎయిర్ టెల్ టారిఫ్ ప్లాన్ల మోత.. 20 శాతం వరకూ పెంపు..