iQoo Z9 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్9 5జీ (iQoo Z9 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ వివో (Vivo) సబ్ బ్రాండ్ ఐక్యూ (iQoo) తాజా జడ్ సిరీస్ ఫోన్ ఐక్యూ జడ్9 5జీ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ చిప్సెట్తో వచ్చింది. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా, 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.
ఐక్యూ జడ్9 5జీ (iQoo Z9 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999 పలుకుతుంది. బ్రష్డ్ గ్రీన్, గ్రాఫెన్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్లకు ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి, సాధారణ కస్టమర్లకు ఈ నెల 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ఇండియా, ఐక్యూ ఇండియా స్టోర్, ఇతర రిటైల్ స్టోర్లలో లభ్యం అవుతుంది.
ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.2000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.17,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999లకు లభిస్తుంది. మూడు నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై ఫోన్ పని చేస్తుంది. రెండేండ్ల వరకూ ఆండ్రాయిడ్, మూడేండ్ల వరకూ సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది.
ఐక్యూ జడ్9 5జీ (iQoo Z9 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటుతో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2400 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డీటీ-స్టార్ 2 ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటాయి. ఒక్టాకోర్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5జీ ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 8 జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా 16 జీబీ రామ్ వరకూ పెంచుకోవచ్చు. 256 జీబీ స్టోరేజీని మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ పొడిగించొచ్చు.
ఐక్యూ జడ్9 5జీ (iQoo Z9 5G) ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్88 ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 2-మెగా పిక్సెల్ బొకెహ్ షూట్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఐక్యూ జడ్9 5జీ (iQoo Z9 5G) ఫోన్ 5జీ, వై-ఫై6, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 5.3, బైదూ, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, యాంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాగ్జిమిటీ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.
ఐక్యూ జడ్9 5జీ (iQoo Z9 5G) ఫోన్ 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. సింగిల్ చార్జింగ్‌తో 67.78 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైం, 17 గంటల యూ-ట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ టైం బ్యాటరీ లైఫ్ ఉంటది. ఫ్లాష్ చార్జింగ్ టెక్నాలజీతో 31 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ చార్జింగ్ చేయొచ్చు.