Hyundai Alcazar | దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్ తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ)లో వైవిధ్యం దిశగా అడుగులేస్తున్నది. తన అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ కారు బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఆసక్తి గల కస్టమర్లు రూ.25 వేలు చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చునని వెల్లడించింది. కంఫర్ట్, లగ్జరీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది. ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం, సిగ్నేచర్ వేరియంట్లలో హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ వస్తున్నది.
ఫ్రంట్లో న్యూ బంపర్, హుడ్ డిజైన్, స్కిడ్ ప్లేట్, డార్క్ క్రోమ్ గ్రిల్లె ఫీచర్లు ఉంటాయి. న్యూ హెచ్ షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, క్వాడ్ బీమ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఆల్ న్యూ ఆర్18 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ పెయింటెడ్ క్లాడింగ్ అండ్ బ్రిడ్జి టైప్ రూఫ్ రైల్స్ ఉంటాయి. వైడర్, టాలర్, ఫ్యూచరిస్టిక్ అప్పీల్ తో వస్తుందీ కారు.
ఆల్ న్యూ సిగ్నేచర్ కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, న్యూ టెయిల్ గేట్, న్యూ స్పాయిలర్ డిజైన్ విత్ ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్, న్యూ బంపర్ అండ్ స్కిడ్ ప్లేట్ డిజైన్ వంటి ఫీచర్లతో హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ కారు మోడర్న్ ఎస్యూవీగా నిలుస్తుంది. 6 అండ్ 7 సీటర్ ప్రీమియం ఎస్యూవీ కారు అడ్వెంచర్లకు, పట్టణ ప్రాంత ప్రయాణికులకు ఐడియల్ చాయిస్ గా ఉంటది. న్యూ రోబస్ట్ ఎమరాల్డ్ మ్యాట్టెతోపాటు తొమ్మిది స్ట్రైకింగ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
1.5 టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ విత్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిసన్, 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ (డీసీటీ, 1.5 యూ2 సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్ విత్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. 40 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, అడాస్తోపాటు మొత్తం 70కి పైగా సేఫ్టీ ఫీచర్లు కలిగి ఉంటుంది.