Hyundai Inster EV |ప్రముఖ దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ కంపెనీ తన మైక్రో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇన్‌స్టర్ (Inster)ను గ్లోబల్ మార్కెట్లో ప్రదర్శించింది. బుసాన్ ఇంటర్నేషనల్ మొబిలిటీ షోలో ఆవిష్కరించిన హ్యుండాయ్ ఇన్‌స్టర్.. భారత్ మార్కెట్లోని ఎక్స్టర్ను పోలి ఉంటుంది. హ్యుండాయ్ కాస్పర్ డిజైన్‌తో రూపుదిద్దుకున్న ఇన్‌స్టర్ (Inster) ఒక కంపాక్ట్ ఎస్యూవీ. ఇది ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, పిక్సెల్ గ్రాఫిక్ టర్న్ సిగ్నల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, డ్యుయల్ టోన్ ఎక్స్టీరియర్ పెయింట్ స్కీం విత్ కాంట్రాస్టింగ్ బ్లాక్ రూఫ్ తో ఈవీ స్పోర్టీ లుక్ ఇస్తుంది. స్పెషిఫికేషన్లను బట్టి 15-అంగుళాల స్టీల్ వీల్స్ విత్ కవర్స్, 15-అంగుళాల అల్లాయ్స్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. దీన్ని భారత్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు కానీ, భారత్ లోకి ఎంటరైతే టాటా పంచ్.ఈవీతో పోటీ పడుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో దక్షిణ కొరియా, అటుపై యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్ మార్కెట్లలో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం భారత్ మార్కెట్లో హ్యుండాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ ఈవీ విక్రయిస్తున్నది. దీంతోపాటు భారత్ మార్కెట్లోకి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ కారు.. కోనా ఎలక్ట్రిక్ కారును డిస్ కంటిన్యూ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది భారత్ లోనే తయారు చేసిన ఈవీ కారును ఆవిష్కరిస్తామని హ్యుండాయ్ ఇంతకుముందే ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో భారీ స్థాయిలో ఈవీ ఎస్ యూవీ కార్లు ఉత్పత్తి ప్రారంభించనున్నది. 2030 నాటికి ఐదు ఈవీ కార్లను తీసుకు రానున్నది.
హ్యుండాయ్ ఇన్‌స్టర్ ఇన్సైడ్ క్యాబిన్లో 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ విత్ నేవిగేషన్, 64 కలర్ ఎల్ఈడీ అంబియెంట్ లైటింగ్, వైర్ లెస్ చార్జింగ్ డాక్ తదితర ఫీచర్లు ఉంటాయి. హ్యుండాయ్ ఇన్‌స్టర్ ఈవీ కారు స్టాండర్డ్‌గా 42 కిలోవాట్ల బ్యాటరీతోనూ, లాంగ్ రేంజ్ వర్షన్ 49 కిలోవాట్ల బ్యాటరీతో వస్తుంది. రెండు మోడల్ కార్లలోనూ సింగిల్ మోటార్ ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 97 పీఎస్ (బేస్ వేరియంట్), 115 పీఎస్ (లాంగ్ రేంజ్ వర్షన్) తోపాటు 147 ఎన్ఎం టార్క్ వెలువరిస్తాయి. హ్యుండాయ్ ఇన్‌స్టర్ లాంగ్ రేంజ్ వర్షన్ సింగిల్ చార్జింగ్ తో 355 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. 120కిలోవాట్ల డీసీ చార్జర్ సాయంతో 30 నిమిషాల్లో 10-80 శాతం చార్జింగ్ అవుతుంది. స్టాండర్గా కారుతోపాటు 11కిలోవాట్ల చార్జర్ ఉంటుంది. దీంతోపాటు బ్యాటరీ హీటింగ్ సిస్టమ్, హై ఎఫిషియెన్స్ హీట్ పంప్ కూడా ఉంటాయి.
Nissan new X-Trail SUV | ఆ ఐదు ఎస్‌యూవీలకు పోటీగా నిసాన్ న్యూ ఎక్స్-ట్రయల్.. వచ్చేనెలలో ఆవిష్కరణ..!
Stock Market Close | కొత్త శిఖరాలకు సూచీలు.. 79వేలు దాటిన సెన్సెక్స్.. 24వేల ఎగువన ముగిసిన నిఫ్టీ..
Hyundai Verna | మారుతి సియాజ్.. హోండా సిటీతో పోలిస్తే.. ఈ కారు మిడ్ సైజ్ సెడాన్ కార్లలో బెస్ట్ ..
Hyundai CNG Car | త్వరలో హ్యుండాయ్ నుంచి డ్యుయల్ సిలిండర్ సీఎన్జీ కారు.. !