Home Sales | ప్రతి ఒక్కరూ సొంతింటి కోసం కల కంటూ ఉంటారు. గతంతో పోలిస్తే కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ స్పేసియస్గా ఇండ్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐటీ రంగానికి కేంద్రంగా మారుతున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టు పక్కలా కొత్త కాలనీలు పెరుగుతున్నాయి. కానీ, ఇటీవలి కాలంలో ఇండ్ల కొనుగోళ్లు తగ్గినట్లు ప్రముఖ ప్రాపర్టీ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ పేర్కొంది. 2023తో పోలిస్తే 2024లో ఏప్రిల్ -జూన్ మధ్య కొత్త ఇండ్ల ప్రాజెక్టులు, విక్రయాలు గణనీయంగా తగ్గాయని ప్రాప్ ఈక్విటీ పేర్కొంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా, పుణె, నేవీ ముంబైల్లో పోలిస్తే ఠాణె, హైదరాబాద్ నగరాల్లో 36 శాతం ఇండ్ల కొనుగోళ్లు తగ్గాయి.
2024 జనవరి -మార్చి మధ్య 23,595 యూనిట్లు అమ్ముడైతే ఏప్రిల్ -జూన్ మధ్య 15,016 యూనిట్లు అమ్ముడయ్యాయి. అలాగే కొత్త ప్రాజెక్టులు ఏప్రిల్-జూన్ మధ్య 11,603 ప్రారంభమైతే, తొలి త్రైమాసికంతో పోలిస్తే 19 శాతం తక్కువ.అలాగే 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది 36 శాతం కొత్త ప్రాజెక్టులు తగ్గిపోయాయి. 18,232 యూనిట్ల నుంచి 11,603 యూనిట్లకు తగ్గిపోయాయి. గతేడాది రెండో త్రైమాసికంలో 18,757 ఇండ్లు అమ్ముడైతే, ఈ ఏడాది 15,016 యూనిట్లకు పరిమితం అయ్యాయి.
హైదరాబాద్ నగరానికి భిన్నంగా ఢిల్లీలో 96 శాతం, బెంగళూరులో 67, చెన్నైలో 21 శాతం కొత్త ప్రాజెక్టులు పెరిగాయి. హైదరాబాద్ తో పోలిస్తే పుణెలో కొత్త ప్రాజెక్టులు 47 శాతం తగ్గాయి. ముంబై, కోల్ కతాల్లో ఇండ్ల విక్రయాలు 27 శాతం పెరిగితే, హైదరాబాద్ లో 20 శాతం, పుణెలో 15 శాతం తగ్గాయి.
Nissan new X-Trail SUV | ఆ ఐదు ఎస్యూవీలకు పోటీగా నిసాన్ న్యూ ఎక్స్-ట్రయల్.. వచ్చేనెలలో ఆవిష్కరణ..!
Stock Market Close | కొత్త శిఖరాలకు సూచీలు.. 79వేలు దాటిన సెన్సెక్స్.. 24వేల ఎగువన ముగిసిన నిఫ్టీ..
Hyundai Verna | మారుతి సియాజ్.. హోండా సిటీతో పోలిస్తే.. ఈ కారు మిడ్ సైజ్ సెడాన్ కార్లలో బెస్ట్ ..
Hyundai CNG Car | త్వరలో హ్యుండాయ్ నుంచి డ్యుయల్ సిలిండర్ సీఎన్జీ కారు.. !