FII Funds | దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) జూన్ నెలలో సుమారు రూ.26,565 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఆందోళనలు సమసిపోవడంతో ఇన్వెస్టర్ల దృష్టి తాజాగా 2024-25 బడ్జెట్ మీద పడింది. అలాగే భారత్ బాండ్ల జాబితాలో జేపీ మోర్గాన్ బాండ్ ఇండెక్స్ చేర్చడం కూడా దీనికి మరో కారణం. గత రెండు నెలలుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా స్టాక్స్ విక్రయించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత సంస్కరణలు కొనసాగుతాయా? లేదా? అన్న విషయమై సందేహాలతో స్టాక్స్ విక్రయించిన ఎఫ్ఐఐలు.. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత యూ-టర్న్ తీసుకున్నారు. జీడీపీ వృద్ధి చెందుతుందన్న అంచనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఎఫ్ఐఐ నిధులు వచ్చి పడ్డాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
గత 12 సెషన్లలో దేశీయ స్టాక్ మార్కెట్ల (బీఎస్ఈ, ఎన్ఎస్ఈ)లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) రూ.32 వేల కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. 2024 ద్వితీయార్థంలో వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాల మధ్య ఎఫ్ఐఐ నిధులు వచ్చి పడ్డాయి. మరోవైపు గత రెండు నెలల్లో ఎఫ్ఐఐలు రూ.34 వేల కోట్ల విలువైన షేర్లు విక్రయించారని సెబీ డేటా చెబుతోంది. ఎన్నికల అనంతరం సుస్థిర పరిస్థితులు, బ్లూ చిప్ కంపెనీల స్టాక్స్ కొనుగోళ్లతో పెరిగిన విలువ, బడ్జెట్ మీద అంచనాలు, మైక్రో సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు, ఎంఎస్సీఐ ఇండెక్స్, బాండ్ ఇండెక్స్, చైనా నుంచి ఎఫ్ఐఐల నిష్క్రమణ తదితర అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐ నిధుల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.
Tata Motors | ఆరేండ్లలో 60 లక్షల కార్ల విక్రయాలు.. ఇదీ టాటా మోటార్స్ బ్లూ ప్రింట్ ..!
Maruti Suzuki Swift | మారుతి ‘సిగ’లో మరో మైలురాయి.. 30 లక్షలు దాటిన ‘స్విఫ్ట్’ సేల్స్..!
Bharti Airtel | ఎయిర్ టెల్ టారిఫ్ ప్లాన్ల మోత.. 20 శాతం వరకూ పెంపు..
July Bank Holidays | జూలైలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. .ఇవీ డిటైల్స్..!
Realme C61 5G | రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్మీ సీ 61 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!