TV offer : స్మార్ట్ టీవీ కొనాలనే ఆలోచనలో ఉన్నవారికి శుభవార్త. ఎందుకంటే ఇప్పుడు పెద్ద టీవీల ధరలు తగ్గాయి. తక్కువ ధరకే పెద్ద టీవీలు వస్తున్నాయి. చిన్న టీవీల ధరకే పెద్ద టీవీని కొనుగోలుచేసే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా 32 అంగుళాల టీవీలు కొంటారు. అంతకంటే పెద్ద టీవీ అయితే కనీసం రూ.50 వేల నుంచి 60 వేలు పెట్టాల్సి ఉంటుంది.
అయితే ఇప్పుడు అందులో సగం ధరకే మీరు 55 అంగుళాల స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. వీయూ కంపెనీ 55 అంగుళాల ‘ది గ్లోలెడ్ సిరీస్ 4కే స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ’పై ఈ ఆఫర్ ఇస్తోంది. 4కే రిజల్యూషన్‌తో 60 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. ఏఐ పీక్యూ ఇంజిన్, డైనమిక్ బ్యాక్ లైట్ కంట్రోల్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఎంఈఎంసీఐ మోషన్ ఎన్హాన్స్మెంట్, డిజిటల్ నాయిస్ రిడక్షన్, గ్లో ఏఐ ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ తో వస్తుంది.
2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ స్పేస్‌తో లభిస్తుంది. ఇందులో 104 వాట్ డీజీ సౌండ్, బిల్ట్ ఇన్ సబ్ ఊఫర్, డాల్బీ అట్మాస్, ఫుల్ రేంజ్ 4 స్పీకర్, సరౌండ్ సౌండ్, బాస్ బూస్ట్ ఫీచర్స్‌తో వస్తుంది. దీని మీద కంపెనీ ఏడాది వారంటీ ఇస్తుంది. ఈ టీవీ ప్రత్యేకత ఏంటంటే టేబుల్ మీద కావాలంటే టేబుల్ మీద పెట్టుకోవడానికి స్టాండ్, గోడకు తగిలించుకోవాలనుంటే ఒక వాల్ మౌంటెడ్ బ్రాకెట్ ఇస్తున్నారు.
ఆన్ లైన్లో దీని ధర రూ.65 వేలు కాగా ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్లో కేవలం రూ.36,499కే సొంతం చేసుకోవచ్చు. అలానే ఎంపిక చేయబడ్డ క్రెడిట్ కార్డుల మీద రూ.1750 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.