Credit Card | మనలో చాలామంది క్రెడిట్ కార్డ్స్ వాడుతూంటారు. అయితే ఈ క్రెడిట్ కార్డుల్లో ఎన్ని రకాలున్నాయో.. వాటి లాభాలేంటో మీకు తెలుసా? బ్యాంకింగ్ రంగంలో ఉన్న ప్రస్తుత పోటీ వాతావరణంలో కస్టమర్లను ఆకట్టుకోవడం ఓ పెద్ద టాస్క్ అయిపోయింది. అందుకే యూజర్ల అవసరాలకు, అలవాట్లకు తగ్గట్టుగా ఒక్కో కార్డుకు ఒక్కో రకంగా ప్రయోజనాలను చేర్చి అందిస్తున్నాయి ఆయా సంస్థలు.
బేసిక్ క్రెడిట్ కార్డ్స్
బ్యాంకులు, సంస్థలు తమ కస్టమర్లకు ఉచితంగానే ఇస్తున్నాయి. మరికొన్ని తక్కువ ఫీజును వసూలు చేస్తున్నాయి. పెద్దగా బెనిఫిట్స్ ఏవీ ఉండవు.
రివార్డులకు..
క్రెడిట్ కార్డ్స్‌ను ఎక్కువగా వాడేవారికి ఇవి ఉత్తమం. ప్రతీ కొనుగోలుపై రీడిమబుల్ రివార్డ్స్ యాడ్ అవుతాయి.
క్యాష్ బ్యాక్ కోసం..
వీటితో మనం కొనే వస్తువుల ధర కొంత మొత్తం తగ్గుతుంది. అకౌంట్లలో ఆ మొత్తా లు జమవుతాయి.
ప్రయాణాలకు వీలుగా..
ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి సౌకర్యంగా ఉంటాయి. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, హోటల్ చార్జీల్లో రాయితీ వంటివి అందుకోవచ్చు.
వ్యాపారస్తులకు ప్రయోజనకారిగా..
వ్యాపారులు, కంపెనీల యజమానుల కోసం వీటిని ఇస్తున్నారు. వ్యాపార లావాదేవీలపై రివార్డ్స్ పొందవచ్చు.
విద్యార్థుల కోసం..
పరిమిత రుణ చరిత్ర ఉన్నవారు, యువతకు లాభదాయకం. వార్షిక చార్జీలుండవు. బోనస్ పాయింట్లు వస్తాయి.
కో-బ్రాండెడ్
వీటితో ఉచిత హోటల్ సర్వీసునూ అందుకోవచ్చు. అయితే హై ఎండ్ కస్టమర్లకే ఇవి దొరుకుతాయి.
స్టోర్ క్రెడిట్ కార్డ్స్
రిటైల్ స్టోర్ల ద్వారా ఇష్యూ అవుతున్నాయి. ఎక్కడైతే లేదా ఎవరైతే ఇస్తారో అక్కడే ఈ క్రెడిట్ కార్డ్స్ చెల్లుతాయి.
షాపింగ్ కోసం..
ఆన్లైన్, ఆఫ్‌లైన్ షాపర్స్‌కు సూటబుల్. వీటితో కొంటే డిస్కౌంట్లు, రివార్డులు, క్యాష్‌బ్యాక్ వంటి రకరకాల ఆఫర్లను అందుకోవచ్చు.
విమాన ప్రయాణికులకు..
విమానయాన సంస్థలతో కలిసి బ్యాం కులు వీటిని ఇష్యూ చేస్తున్నాయి. టిక్కెట్ల ధరపై రాయితీలు, రివార్డ్ పాయింట్లు అందుతాయి.
ఇంధన వినియోగదారులకు..
వీటితో వాహనదారులు పెట్రోల్, డీజిల్ పోయించుకున్నప్పుడు డిస్కౌంట్ పొందవచ్చు. సర్‌చార్జీలను తప్పించుకోవచ్చు.
వినోదాలకు వెళ్లేవారి కోసం..
సినిమాలకు తరచూ వెళ్లేవారి కోసం ఈ క్రెడిట్ కార్డులున్నాయి. సెక్యూరిటీపైనా క్రెడిట్ కార్డులను పొందవచ్చు. క్రెడిట్ స్కోర్‌తో సంబంధం లేకుండా నగదు గ్యారెంటీతో వీటిని జారీ చేస్తారు.