Bajaj Qute CNG Taxi | వాహన ప్రేమికుల ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో వాహనాలను ఆవిష్కరించడంలో ముందు వరుసలో నిలుస్తోంది బజాజ్ ఆటో (Bajaj Auto). శుక్రవారం ప్రపంచంలోకెల్లా తొలి సీఎన్జీ మోటార్ సైకిల్ బజాజ్ ఫ్రీడమ్ 125 (Bajaj Freedom 125) ఆవిష్కరించింది. ఈ క్రమంలో మరో ముందడుగు వేయనున్నట్లు బజాజ్ ఆటో (Bajaj Auto) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ (Rakesh Sharma) ప్రకటించారు. `క్యూట్ సీఎన్జీ (Qute CNG)’ ఆటో టాక్సీ (Auto Taxi) ని త్వరలో మార్కెట్లోకి తేనున్నట్లు తెలిపారు.
క్యూట్ సీఎన్జీ (Qute CNG) ఆటో ట్యాక్సీని త్వరలో ఈజిప్టులో ఆవిష్కరిస్తామని రాకేశ్ శర్మ తెలిపారు. క్యూట్ ఆటో 4-సీటర్ హ్యాచ్ బ్యాక్ అని తెలిపారు. ఇది ఎల్పీజీ, సీఎన్జీ వేరియంట్లలో యూజర్లకు అందుబాటులో ఉంటుందన్నారు. పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా, అన్ని కాలాల్లో తక్కువ ఖర్చుతో ప్రయాణానికి వీలుగా ఉంటుందీ క్యూట్ ఆటో ట్యాక్సీ.
Jio | ఓటీటీ బెనిఫిట్ ప్లాన్లు కుదించిన రిలయన్స్ జియో..!
Reliance | 52 వారాల గరిష్టానికి రిలయన్స్.. ఎం-క్యాప్‌లో మరో రికార్డు..!
Motorola Razr 50 Ultra | ప్రీమియం సెగ్మెంట్లో మరో ఫోన్ మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా ఆవిష్కరణ..!