Metis : టెక్ దిగ్గజం అమెజాన్ ఓపెన్ఏఐ చాట్‌జీపీటీకి దీటైన పోటీ ఇచ్చేందుకు కసరత్తు సాగిస్తోంది. చాట్‌జీపీటీని ఢీ కొనేందుకు నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ను లాంఛ్ చేసేందుకు అమెజాన్ ప్రణాళికలు రూపొందిస్తోంది. మెటిస్ పేరుతో అమెజాన్ న్యూ ఏఐ చాట్‌బాట్ యూజర్ల ముందుకు రానుంది. అమెజాన్ అంతర్గత ఏఐ మోడల్ ఒలింపస్ ఆధారంగా మెటిస్ పనిచేస్తుందని భావిస్తున్నారు.
అమెజాన్ ప్రస్తుత మోడల్ టైటాన్ ఏఐ మోడల్ కంటే ఒలింపస్ అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్ కావడం గమనార్హం. సంభాషణల పద్ధతిలో టెక్ట్స్, ఇమేజ్ ఆధారిత సమాధానాలను ఇచ్చేలా మెటిస్ను డిజైన్ చేస్తున్నారు. సోర్స్ రెస్పాన్స్‌లకు లింక్‌లు షేర్ చేయడం, ప్రశ్నలను ఫాలోఅప్ చేయడం, ఇమేజ్ జనరేట్ చేయడం వంటి విధులనూ మెటిస్ నిర్వర్తిస్తుంది.
మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ సమా పలు టెక్ కంపెనీల న్యూ ఏఐ అసిస్టెంట్లకు దీటుగా మెటిస్ను ముందుకు తీసుకొచ్చేందుకు అమెజాన్ కసరత్తు సాగిస్తోంది. ఏఐ రేస్‌లో తొలుత వెనుకబడినట్టు కనిపించిన అమెజాన్ లేటెస్ట్ ఏఐ మోడల్‌తో న్యూ టెక్నాలజీలో సత్తా చాటేందుకు సిద్ధమైంది.
మరోవైపు పలు ఏఐ కంపెనీలు ఎందుకు తమ క్లౌడ్ సేవలను వినియోగించడం లేదని అమెజాన్ వ్యవస్ధాపకులు, మాజీ సీఈవో జెఫ్ బెజోస్ ఇటీవల అమెజాన్ ఉద్యోగులకు పంపిన మెయిల్లో ప్రశ్నించారని సమాచారం. ఇక న్యూ ఏఐ మోడల్ గురించి అమెజాన్ అధికారికంగా ఇప్పటివరకూ ప్రకటించకపోయినా సెప్టెంబర్‌లో మెటిస్ను లాంఛ్ చేయవచ్చని భావిస్తున్నారు. అలెక్సా ఈవెంట్ వేదికగా మెటిస్ను అమెజాన్ లాంఛ్ చేస్తుందని చెబుతున్నారు.
Read More :
Real Estate | దేవుడితో కలిసి ఆవాసం..స్వర్గంలో ప్లాట్లు అమ్ముతున్న స్పానిష్ చర్చి