TTD | హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో జూలైలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 4 నుంచి 14 వరకు నారాయణ వనంలో పరాశరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, 10 నుంచి 12 వరకు శ్రీనివాసమంగాపురంలో కల్యాణ వేంకటేశ్వరస్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు, 16 నుంచి 18 వరకు తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక జ్యేష్టాభిషేకం.
17 నుంచి 25వ వరకు తాళ్లపాకలోని సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్ర హ్మోత్సవాలు, 26న సిద్ధేశ్వర స్వామి, చెన్నకేశ్వర స్వామి ఆలయాల్లో వార్షిక పుష్పయాగం, 29న ఆండాళ్ అమ్మవారి తిరువడిపూడి ఉత్సవం, 30న తిరుపతిలోని కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 31న సర్వ ఏకాదశి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.